RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Prakasam District SSA Outsourcing Posts Notification 2018 - 74 Vacancies Apply Now

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, December 3, 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
Prakasam District SSA Outsourcing Posts Notification 2018 – 74 Vacancies Apply Now : Prakasam విద్యాశాఖలో ఉద్యోగాలు సాధించాలనుకుంటున్న జిల్లాకు చెందిన నిరుద్యోగులకు కొంత మేర ఊరట కలగనుంది. డీఎస్సీ కంటే ముందుగానే సర్వశిక్షా అభియాన్‌లోని ఖాళీలను పొరుగు సేవల పద్ధతిలో భర్తీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఖాళీల భర్తీకి దాదాపు ఆమోదం లభించినట్లే.జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగులంతా విధుల్లో చేరేలా ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ నుంచి మార్గదర్శకాలు అందాయి.



Prakasam District SSA Outsourcing Posts Notification 2018 – 74 Vacancies Apply Now

Prakasam District SSA Outsourcing Posts Notification 2018 - 74 Vacancies Apply Now      Prakasam District SSA Outsourcing Posts Notification 2018 – 74 Vacancies Apply Now

SSA Prakasam District Outsourcing Posts Vacancies

Prakasam District SSA Vacancies 74 ఖాళీల భర్తీ Uజిల్లాలో 74 పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం లభించినట్లు తెలిసింది.

ఇందులో సీఆర్పీలు-19, ఎస్‌వో-2 ఉండగా మిగిలినవి డీఎల్‌ఎంటీలు, ఎంఐఎస్‌ సమన్వయకర్తలు, ఐఈఆర్టీ సమన్వయకర్తలు, సీఆర్టీ, పీఈటీలు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, కార్యాలయ సబార్డ్‌నేట్‌ తదితర విభాగాల్లో భర్తీ చేస్తారు.

Selection Process of SSA Prakasam Outsourcing Posts 

దీనికి జిల్లా కలెక్టర్‌ లేదా సంయుక్త కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండి డీఈవో, డైట్‌ ప్రధానాచార్యులు ఎస్‌ఎస్‌ఏ పీవో సభ్యులుగా ఉండి కమిటీ నియామకం ఉంటుంది.
ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్షను 100 మార్కులకు బహుళైచ్ఛిక విధానంలో నిర్వహిస్తారు.
బోధనేతర సిబ్బంది నియామకాలు రిజర్వేషన్‌, రోస్టర్‌ పద్ధతిలో జరుగుతాయి.
వీటికి సంబంధించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ముఖాముఖి ద్వారా ఎంపిక చేస్తారు.

Eligibility Criteria :

  1. ఈ ఏడాది జులై ఒకటో తేదీ నాటికి ఓబీసీ అభ్యర్థులు 39 ఏళ్లు, బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు 44 ఏళ్ల లోపు ఉండాలి.
  2. కేజీబీవీ ఎస్‌వో పోస్టులకు 50 శాతం మార్కులతో పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
  3. సీఆర్టీలు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేయడంతో పాటు టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  4. పీఈటీలు ఇంటర్మీడియెట్‌తో పాటు వ్యాయామ విద్యలో డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
  5. డీఎల్‌ఎంటీలు డిగ్రీతో పాటు బీఈడీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ధ్రువీకరణ ఉండాలి.
  6. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు పదో తరగతితో పాటు చిత్రలేఖనం, కమర్షియల్‌ ఆర్ట్స్‌, ఆర్కిటెక్చర్‌ డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
  7. సీఆర్పీలు పీజీ సోషియాలజీ, సోషల్‌ వర్కర్‌ లేదా బీఈడీతో పాటు టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

Prakasam District SSA మొత్తం పోస్టులు 74 : 

kgbv spl. ఆఫీసర్–2
crt–14
crp–19
పార్ట్ టైం ఇన్స్ట్రుక్టర్లు–2
mis co-ordinator–1
deta entry operator–2
అటెండెర్–2
PET –3
ANM –1
cook–4
kgbv లో ఓకేషనల్ టీచర్లు–12
కంప్యూటర్ ఇన్స్ట్రుక్టర్లు–12
IERT -1

Last oo Apply : 15.12.18 లోపు దరఖాస్తు చేసుకోగలరు.
14 CRT (tel-2,eng-1,mat-3,ps-3,bs-4,sos-1)లు,2 SO పోస్టులకి జనవరి 9,10 తేదీ లలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

రాత పరీక్ష 100 మార్కులకి ఆబ్జెక్టివ్ పద్దతిలో జరుగుతుంది.
నమూనా దరఖాస్తులు RVM, SSA, DEO వెబ్సైట్ లలో దొరుకుతాయి.
SO & CRT పోస్టులకి మహిళా అభ్యర్థులు నేరుగా ssa ఆఫీస్ లో దరఖాస్తులు సమర్పించాలి.
మిగిలిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు రాణా మాన్యపవర్ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకోవాలి.
తాజా నిబంధనలు ప్రకారం ఎంపిక ప్రక్రియ కూడా ఏజెన్సీకే అప్పగించారు.
ఏజెన్సీ వారు సిఫార్సు చేసిన వారిని నేరుగా ఉద్యోగంలో నియమిస్తారు.
ఈ ఏజెన్సీ ఒంగోలు లోని మంగమూరు డొంక లో ఉంది.




Prakasam District SSA Outsourcing Posts Notification 2018 - 74 Vacancies Apply Now Application form, Vacancies and Selection Process Download.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: December 03, 2018

0 comments:

Post a Comment