RCs

PO Hand Book Elections 2019 in Telugu | Duties of Presiding Officers

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Sunday, March 17, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

PO Hand Book Elections 2019 in Telugu | Duties of Presiding Officers 

PO handbook 2019 - Brief outlines of Duties of Presiding officers. ప్రిసైడింగ్ అధికారుల విధుల గురించి కొన్ని సూచనలు. How to Conduct Mock Poll, Before Poll, After Poll, During the Poll,  How to Check EVM, VVPAT Working States, Duties of polling officers, PO Submit Forms and Covers list Download. Duties of Presiding Officers 2019, Election Duty Officers Training Manual Download.



PO Hand Book Elections 2019 in Telugu | Duties of Presiding Officers 

During Training

  1. PO లు రెండు శిక్షణలకు హజరు కావాలి.
  2. శిక్షణలో ఎన్నికల, పోలింగ్ చట్టాల గురించి, నియమావళి, కొత్తగా వచ్చిన (Fresh) రూల్స్ గురించి తెలుసుకోవాలి.
  3. EVMs, VVPATs ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవాలి.
  4. Statutory, Non statutory ఫారాలు ఏ విధంగా భర్తీచేయాలో తెలుసుకోవాలి.
  5. EVMs, VVPATs ఏ విధంగా పోలింగ్ కు తయారు చేసుకోవాలో నేర్చుకోవాలి.

At Dispatch centre

  1. డిస్ట్రిబ్యూషన్ సెంటరు నుండి EVMs, VVPATs తీసుకోవాలి.
  2. టెండరు బ్యాలట్ పేపర్లు, బ్రైయిలి బ్యాలట్ పేపర్లు, మార్క్ డ్ & వర్క్ డ్ అవుట్ ఓటర్ల జాబితా, ఫారం 17-C( పొలైన ఓట్ల గురించి), 17 A, PO డైరీ, ట్యాగులు, సీళ్ళు వగరైనా వాటి పైన అవగాహన ఉండాలి.

Mock poll గురించి ( మాదిరి పోలింగ్)

  1. మాక్ పోల్ కు ముందుగా పోలింగ్ ఏజంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కండి. డిస్ ప్లే సెక్షన్ లో 'O' సున్నను వారికి చూపాలి.
  2. అలాగే VVPAT లోని Drop Box ఖాళీగా ఉన్న సంగతిని వారికి చూపాలి.
  3. పోలింగ్ ఏజంట్లు కంపార్టుమెంటులోనికి వెళ్ళి బ్యాలట్ యూనిట్ లో తమకు ఇష్టం వచ్చిన గుర్తుకు బ్లూబటన్ పై నొక్కాలి. ఈ విధంగా 50 కి పైగా ఓట్లను వేయించాలి.
  4. CU లో క్లోజ్ బటన్ నొక్కాలి.
  5. రిజల్ట్ బటన్ నొక్కాలి.
  6. తరువాత VVPAT లోని స్లిప్స్ తో Control Unit (CU) లో పోలైన ఓట్లను చూపాలి. లెఖ్ఖ సరిపోయిన తరువాత
  7. Control unit లోని ఓట్లను clear చేయాలి.
  8. మాక్ పోల్ అనంతరం VVPATs లోని Slips తీసుకొని వెనుక Mock poll ముద్రను వేయాలి.

  9. మాక్ పోల్ స్లిప్స్ ను ఒక కవరులో వుంచి సీలు చేసి, Presiding officer సంతకం చేసి పోలింగ్ ఏజంట్లతో సంతకం చేయించి, వాటిని ప్లాస్టిక్ డబ్బాలో వుంచి, పింక్ కలర్ ట్యాగ్ తో సీలు చేయాలి.ఆ ట్యాగ్ మీద P0 సంతకం చేసి, పోలింగ్ ఏజంట్ల సంతకం తీసుకోవాలి. Plastic Box మీద నియోజకవర్గం పేరు, నెంబరు, పోలింగ్ స్టేషన్ పేరు నెంబరు వ్రాయాలి.
  10. PO hand book లోని అనెక్జర్ 14 ప్రకారం ప్రిసైడింగ్ అధికారి మాక్ పోల్ సర్టిఫికేట్ వ్రాయాలి.అదేవిధంగా అనేక్జరు - 7 లో చూపిన విధంగా PO డిక్లరేషన్ వ్రాయాలి.
  11. CU లను, VVPATలోని డ్రాప్ బాక్స్ లను సీలు చేయాలి. 

Before Poll 

  1. పోలింగ్ బూత్ /Compartment నిర్మాణం.
  2. EVMS / VVPAT లలో మాదిరి పోలింగ్ / Mock poling నిర్వహించడం.
  3. మాక్ పోల్ లో EVM లో పొలైన ఓట్లతో VVPAT స్లిప్స్ ప్రకారం సరిచూడటం.
  4. EVMs, VVPATsలో Mock పోలింగ్ రిజల్ట్ ను క్లియర్ చేయాలి.
  5. VVPAT పేపరు సీళ్ళ వెనుక stamping చేసి, సీలు చేయడం చేయాలి.
  6. EVMs/VVPATs సీలు చేయడం.

During Poll

  1. అభ్యర్థులకు,పోలింగ్ ఏజంట్లకు రహస్య ఓటింగ్ పద్ధతి గురించి తెలియచేయాలి.
  2. పోలింగ్ డిక్లరేషన్ ను బిగ్గరగా చదివి వినిపించి, Candidate, Polling Agents సంతకాలు తీసుకోవాలి.
  3. ఫారం 17 A లో ఎంట్రీలు సక్రమంగా జరగేవిధంగా చూడాలి.EVMs/ VVPATs సక్రమంగా పనిచేసేలా చూడాలి.
  4. జరిగిన ప్రతి సంఘటనను Presiding officer Diaryలో వ్రాయాలి. 





Closure time of Poll

  1. పోలింగ్ సమయం ముగిసిన తరువాత క్యూలో ఉన్న ఓటర్లకు స్లిప్స్ ఇవ్వాలి.
  2. చివరి వ్యక్తి ఓటు వేసిన తరువాత Presiding officer క్యూ వద్దకు వెళ్ళి ఎవరు లేరని నిర్దారించుకొని పోలింగ్ స్టేషన్ తలుపులు మూయాలి.
  3. చివరి ఓటు వేయగానే control unit లో close button నొక్కాలి.
  4. CU లలో బ్యాటరి off చేయాలి.
  5. EVMs /VVPATs లను సీలు చేయాలి.
  6. 17 C లో అనగా రికార్డైన ఓట్ల గురించి వ్రాయండి. సంతకం చేయాలి. పోలింగ్ ఏజంట్లతో సంతకాలు చేయించండి.
  7. సరిచూసుకొని బందోబస్తుతో రిసెప్షన్ సెంటర్ కు బయలుదేరాలి.

Wrong print of VVPAT Paper slips

VVPAT లోని స్లిప్స్ తప్పు చూపెడుతున్నాయంటే ఏం చేయాలి
  1. Rule 49 MA ప్రకారం చర్యలు తీసుకోవాలి.
  2. Hand Book లోని Annexure - 15 ప్రకారం ఫిర్యాదు చేసిన ఓటరు వద్ద డిక్లరేషన్ ను PO తీసుకోవాలి.
  3. పోలింగ్ ఏజంట్ల సమక్షంలో 17 A లో ఓటరు వివరాలు మరోసారి ఎంటర్ చేయాలి.
  4. CU నుండి ఓటును రిలీజు చేయాలి.POగారు ఏజంట్ల సమక్షంలో VVPAT లో వచ్చిన స్లిప్ ను పరిశీలించాలి.
  5. ఓటరు కంప్లైంట్ నిజమైతే పోలింగ్ ను ఆపేసి Returning officer కు తెలియచేయాలి.
  6. ఓటరు ఫిర్యాదు తప్పని తేలితే 17 A లో ఆ ఓటరు రెండవసారి వ్రాసిన వివరాల రిమార్క్ కాలమ్ లో ఓటరు చేసిన ఫిర్యాదు తప్పని వ్రాయాలి.
  7. 17 Cఅనగా పొలైన ఓట్ల వివరాలు తెలిపే ఫారం లోని మొదటి భాగం (Part-1) లో ఆ వివరాలు నమోదు చేయాలి.

Defective EVMs & VVPATs

  • పోలింగ్ సమయంలో EVMs, VVPATs పని చేయకపోతే రిజర్వ్ వాటితో Replace చేయాలి.
  • కొత్త EVMs / VVPATs లతో Mock poll చేయాలి. డిక్లరేషన్ వ్రాయాలి.
  • ASD జాబితాలో ఉన్న ఓటరు ఓటువేయటానికి వస్తే ఏం చేయాలి.
  • working Copies and Marked copies of Electoral లో Absent, shifted, Death ఓటర్లను మార్క్ చేసి వుంటారు.
  • అపుడు PO ఆ ఓటరు తెచ్చిన ఐటంటితో ఓటర్ల జాబితాలోని వివరాలు సరిచూడాలి.
  • నిజమైతే 17Aలో ఆ ఓటరు సంతకంతో పాటు వ్రేలిముద్ర తీసుకోవాలి. ఓటుకు అనుమతించాలి.
  • ఇలాగా ASD జాబితా నుండి ఓటువేసిన వారి వివరాలతో ఒక రికార్డు తయారు చేయాలి.

Voter with unofficial voter Slip

  1. ఓటరు అనధికారికంగా ఇచ్చిన ఓటరు స్లిప్ తో వస్తే ఏం చేయాలి.
  2. ఓటరు తెచ్చిన అనధికారిక స్లిప్ లో అభ్యర్ధి పేరు, పార్టీపేరు, గుర్తులుంటే PO ఆ అభ్యర్ధికి లేదా ఆ రాజకీయపార్టీకి చెందిన పోలింగ్ ఏజంట్ ను ఇలాంటివి పోలింగ్ స్టేషన్ లోనికి పంపరాదని హెచ్చరించాలి.
  3. చదువురాని ఓటరు ఓటు వేయటానికి వస్తే మొదటి పోలింగ్ అధికారి అతని సీరియల్ నెంబరు చదివి, అతని పేరేమిటో చెప్పమని అడగాలి. ఆ ఓటరు అతని పేరు వివరాలు చెబితే అతనిని అనుమతించాలి.
  4. తప్పు చెబితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

Challenged Votes

  1. ఓటరు యొక్క ఉనికిని పోలింగ్ ఏజంట్లు ఆక్షేపిస్తే ఏం చేయాలి.
  2. ఓటు వేయటానికి వచ్చిన ఓటరు ఉనికిని / Identity ని పోలింగ్ ఏజంట్లు సందేహిస్తే, సందేహించిన వారి నుండి రెండు రూపాయల రుసుము వసూలుచేసి రశీదు ఇవ్వాలి.
  3. PO ఓటరు తెచ్చిన వివరాలతో తన వద్ద ఓటరు జాబితా వివరాలతోనూ, అక్కడికక్కడే అప్పటికప్పుడే ఒక చిన్న విచారణ చేయాలి.
  4. PO సంతృప్తి చెందితే ఓటు వేయటానికి అతనిని అనుమతించాలి.
  5. పోలింగ్ ఏజంట్ చేసిన ఛాలెంజ్ నిజమైతే వచ్చిన వ్యక్తిని వ్రాతపూర్వక ఫిర్యాదుతో పోలీసులకు అప్పగించాలి.ఆ వివరాలను Form - 14లో వ్రాయాలి.

Tendered votes

  • ఒక ఓటరు ఓటును మరొకరు వేసివుంటే ఏం చేయాలి.
  • ఓటరు పోలింగ్ బూత్ కు వచ్చాడు. కాని అప్పటికే ఇతరులెవ్వరో ఆ ఓటు వేసేశారు. అపుడు presiding officer ఓటరు తెచ్చిన identity ని పరిక్షించాలి.
  • అక్కడే ఒక విచారణ చేయాలి.నిజమైతే టెండర్ బ్యాలట్ పేపరు, క్రాస్ డ్ మార్క్ యారో గల రబ్బరు స్టాంప్ ను ఇచ్చి ఓటు వేసుకోనివ్వాలి. ఎట్టి పరిస్థితులలోనూ Evm ద్వారా ఓటుకు అనుమతించరాదు.
  • టెండెర్ బ్యాలట్ వివరాలు ఫారం 17 B లో వ్రాయాలి.

Declaration of elector about his age

  1. ఓటరు ఓటు వేయటానికి వచ్చాడు. రూపం చూస్తే 18 సం॥నిండినట్లు కనబడుట లేదు.
  2. అలాంటి సందర్భంలో అలా వచ్చిన ఓటరును ఓటును అనుమతించాలి.ఐతే అతని వద్ద అనెక్జర్ - 7లో చూపిన విధంగా డిక్లరేషన్ తీసుకోవాలి. 1.1. 2019 నాటికి తనకు 18 సం॥వయస్సు నిండినదని డిక్లరేషన్ తీసుకోవాలి. అతను ఇచ్చిన డిక్లరేషన్ తప్పని తేలితే చర్యలుంటాయని హెచ్చరించాలి.
  3. ఓటు వేసిన వివరాలను PO hand book లో కనబరచిన అనెక్జరు - 9 లో పొందుపరచాలి.

Electors decide not to vote

  • పోలింగ్ స్టేషన్ కు వచ్చి Form -17Aలో సంతకం చేసి, ఓటు వేయనని నిరాకరిస్తే ఓటు వేయమని బలవంతం చేయరాదు.
  • 17 A లోని రిమార్క్ కాలమ్ లో ఓటరు ఓటు వేయనిరాకరించివాడని వ్రాయాలి.ఓటరు కూడా సంతకం చేయాలి. అతను చేసినా చేయకపోయినా PO సంతకం చేయాలి.
  • అప్పటికే CU లో ఓటు రిలీజ్ జరిగివుంటే తరువాతి ఓటరుకు ఆ ఓటు వేసుకొనేందుకు అనుమతించాలి.

Duties of polling officers ( పోలింగ్ అధికారుల విధులు )

  1. ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు రెండు శిక్షణలు తప్పక పొందాలి. గతంలో వీరు EVMs ద్వారా పోలింగ్ విధులు నిర్వహించినప్పటికి ఈ శిక్షణలను తప్పక పొందాలి.
  2. EVMs గురించి కొత్తగా ప్రవేశపెట్టిన VVPATs గురించి శిక్షణ పొందడమే కాకుండా స్వయంగా Rehearls చేయాలి. ఎలా పనిచేస్తాయో స్వయంగా తెలుసుకోవాలి.
  3. PO hand book లోని అంశాలు చదివి అర్ధంచేసుకోవాలి. చట్టాలు గురించి, రకరకాల ఫారాలు గురించి తెలుసుకోవాలి.
  4. కొత్తగా / (Newly/ Fresh) వచ్చిన నియమ నిబంధనలు తెలుసుకోవాలి.
  5. ఫారం 12లో పోస్టల్ బ్యాలట్ కు ధరఖాస్తు చేయాలి.12 B లో EDC కి ధరఖాస్తు చేయాలి.
  6. పోలింగ్ రోజుకు ముందు రోజునే పోలింగ్ స్టేషన్ కు రావాలి. R0, S0లకు రిపోర్ట్ చేయాలి. ఇతర పోలింగ్ సిబ్బందిని, Micro observer ను, webcasting Assistant ను, Videographer ను కలవాలి.
  7. పంపకాల కేంద్రంలో (Distribution Centre) ఇతర పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ మెటీరియల్ తీసుకోవాలి.

తీసుకొన్న మెటీరియల్‌లో

  1. EVMs, VVPATs, టెండర్ బ్యాలట్ పేపర్లు, మార్క్ డ్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్స్, అన్ని రకాల ట్యాగులు, స్పెషల్ ట్యాగులు, గ్రీన్ పేపరు సీళ్ళు, స్ట్రిప్ సీల్లు, ఇండెలిబుల్ ఇంక్ మొ॥ చాలా ముఖ్యమైనవి.
  2. ముఖ్యమైన సామాగ్రి మీ నియోజకవర్గంలో మీ పోలింగ్ కేంద్రంనకు చెందినవో కాదో తనిఖి చేయాలి.
  3. నియోజకవర్గం పేరు,నెంబరు, పోలింగ్ స్టేషన్ పేరునెంబరు చూడాలి.
  4. EVMs S Nos చూడాలి.తీసుకొన్నవి ఒకే సీరియల్ నెంబరులో లేకపోయినా,చిరిగిపోయి వున్నా, పాడైపోయివున్నా (Damage), ముద్రణ స్పష్టంగా కనబడకపోయినా RO దృష్టికి తీసుకు వెళ్లాలి.
  5. పోలింగ్ మెటీరియల్‌/ సామాగ్రి తీసుకోని ఆ రోజు సాయంత్రమే ఏర్పాటు చేసిన వాహనంలో మీ పోలింగ్ స్టేషన్ చేరాలి.
  6. అనెక్జరు 4 లో తిరిగి ఇవ్వాల్సిన పోలింగ్ మెటీరియల్ ఉంది.ఈ మెటీరియల్ తో పాటు అదనంగా ఇచ్చే సామాగ్రిని తీసుకోవాలి.
  7. ఆ రోజు రాత్రే పోలింగ్ కంపార్ట్మెంట్ల నిర్మాణం చేయాలి. లోకసభ బూత్ కు తెలుపురంగు స్టిక్కరును, శాసనసభ బూత్ కు పింక్ కలర్ స్టిక్కర్ ను అతికించండి.
  8. సిబ్బందికి, EVMs, VVPATs, పోలింగ్ ఏజంట్లకు బల్లలు కుర్చీలు అరెంజ్ చేసుకోవాలి.
  9. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు పెట్టాలి కావున,7 గంటలలోపుగా వచ్చిన పోలింగ్ ఏజంట్లకు అడ్మిషన్ పాసులు ఇవ్వండి. అందుకుగాను అభ్యర్ధి లేదా Election Agent ఇచ్చిన ఫారం 10 చూడండి. ఇచ్చిన జిరాక్స్ Speciman Signatureతో సంతకాలు సరిచూడండి.

Mock poll కు సిద్ధం చేయండి - మరచిపోవద్దు

లోకసభకు విడిగా, శాసనసభకు విడిగా Mock poll నిర్వహించాలి.పోలింగ్ ఏజంట్స్ ఏ ఒక్కరు రాకపోయినా మాదిరి ఎన్నికలు తప్పక నిర్వహించి సర్టిఫికేట్, డిక్లరేషన్ వ్రాయాలి. వీటిలో మీరు సంతకం చేసి, Polling Agents లతో సంతకాలు చేయించండి.. చేయకపోతే తీవ్ర చర్యలుంటాయి.
  • BUతో VVPATను, VVPAT తో CU ను అనుసంధానం (కనెక్ట్) చేయండి.
  • CU లో క్లియర్ బటన్ నొక్కండి.0 ను polling Agentsను చూపండి.
  • VVPATలో డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉందని వారికి చూపండి.
  • మీరు, పోలింగ్ ఏజంట్స్ బూత్ లోనికి వెళ్ళి 50 పైనే ఓట్లు వేయాలి.
  • డ్రాప్ బాక్స్ లోని స్లిప్స్ తో, రిజల్ట్ Button నొక్కి Display Compartment లో కనబడిన ఓట్లను, డ్రాప్ బాక్స్ లోని రశీదులతో సరి పోల్చండి.
  • స్పెషల్ Tagsతో, Green paper seal తో, strip Sealతో, అడ్రస్ Tagsతో EVMs, VVPATs ను సీలు చేయండి. పై సీళ్ళ మీద మీ సంతకం, పోలింగ్ ఏజంట్ల సంతకాలు తీసుకోవడం మరువవద్దు.
  • కంపార్ట్ మెంట్స్ లో BU, VVPATs ఉంచండి.మీ దగ్గర CUs ఉంచుకోండి. ఎట్టి పరిస్ధితులలోనూ భూమి మీద పెట్టకుండా బల్లలపైనే ఉంచాలి.
  • ఓటర్ల క్యూ కొరకు చర్యలు తీసుకోండి.
  • సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించి ఓటర్లకు సిబ్బందికి తెలియచేయండి.
  • బందోబస్తు గమనించండి.
  • ఓటర్లను ఓటు వేయటానికి పద్ధతి చట్టప్రకారం అనుమతించండి.
  • EVMs మొరాయిస్తే RO / SO లకు తెలియచేసి, రిజర్వ్ EVMs వాడండి.
  • కొత్తవి ఉపయోగించబోయే ముందు Mock Poll నిర్వహించండి.
  • అపుడపుడు మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్స్ ను, 17 A ను గమనించి సిబ్బంది సక్రమంగా వివరాలు నమోదు చేస్తున్నారా లేదా గమనించండి.

PS లో ప్రవేశానికి కొందరికే అనుమతులుంటాయి వారు

  1. అబ్జర్వరు,
  2. అభ్యర్ధి, ఎలక్షన్ ఏజంట్,
  3. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజంట్స్,
  4. ఓటరు, ఓటరు చంకలోని పసిబిడ్డ,
  5. SO, మైక్రోఅబ్జర్వరు, వెబ్ కాస్టింగ్ అసిస్టెంట్, ఉంటే విడియోగ్రాఫరు.
  6. ECI  చే అనుమతించబడిన విలేకరులు.
  7. ECI చే అనుమతి ఉన్న ఇతరులు.

విడియోగ్రాఫరు, Print and Electronic మీడియా వారు పోలింగ్ కంపార్ట్మెంట్ లో ఫోటోలు, విడియోలు తీయరాదు. పోలింగ్ స్టేషన్ లోనికి cell phones ఎవరికి అనుమతి లేదు. PO మాత్రం తన Phone ను సైలెంట్ మోడ్ లో ఉంచుకొని పోలింగ్ వివరాలను మాత్రమే అధికారులతో మాట్లాడాలి.
అపుడపుడు రహస్య ఓటింగ్ పద్ధతి గురించి ఓటర్లకు పోలింగ్ ఏజంట్లకు సిబ్బందికి తెలపాలి.
ఛాలెంజ్, టెండర్డ్ ఓట్ల గురించి ఇంతకు మునుపే చర్చించుకొన్నాం. గుడ్డివారు వికలాంగులు (blind and afirm ఓటర్లు వస్తే వారికి సహయకుల ఏర్పాటు గురించి కూడా తెలుసుకొన్నాం.

Adjournment / Stoppage of poll గురించి

  1. ప్రకృతివైపరీత్యాలు అనగావరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు జరిగి Evms, పోలింగ్ సామాగ్రి పూర్తిగా కాని పాక్షికంగా కాని ధ్యంసమై పోలింగ్ జరపటానికి వీలులేని పరిస్థితులు ఏర్పడినపుడు.
  2. ఏవైనా అవంతారల వలన పోలింగ్ సిబ్బంది PS కు చేరుకోలేనపుడు,
  3. పోలింగ్ బూత్ అక్రమణకు గురైనపుడు, EVMs, పోలింగ్ మెటీరియల్, రికార్డులు ఎత్తుకుపోయినపుడు
  4. పోలింగ్ కేంద్రంలోపల శాంతిభద్రతలకు విఘాతం కలిగినపుడు.
  5. ఇలాంటి సమయాలలో పీ. ఓ. ఇక పోలింగ్ నిర్వహణ / జరపటం సాధ్యంకాదని భావిస్తే Representation of the peoples Act 1951లోని section 57 (1) ప్రకారం పోలింగ్ ఆపి, ఆ విషయాన్ని R0 కు తెలపాలి.
  6. తరువాత ECl వారి అనుమతితో Re polling జరుగుందని ఓటర్లకు పోలింగ్ ఏజంట్లకు చెప్పాలి.
  7. తరువాత EVMs, రికార్డులు PA ల సమక్షంలో చట్ట ప్రకారం సీలు చేసి ఎస్కార్ట్ తో RO కార్యాలయానికి రావాలి.

Close of poll - పోలింగ్ ముగించుట.

  1. ECI వారు చెప్పిన సమయానికే పోలింగ్ ముగించాలి. బహుశా 6 pm ఉండవచ్చును.
  2. అప్పటికే క్యూలో ఓటర్లు వుంటే, ఆ వరుసలోని చివరి ఓటరుకు ఒకటవ నెంబరు Slip ఇవ్వాలి. మొదటి వ్యక్తికి చివరి అంకెను ఇవ్వాలి.
  3. చివరి వ్యక్తి ఓటు వేసిన తరువాత PO క్యూ ప్రదేశాన్ని పరిశీలించి ఎవరూ లేరని నిర్ధారించుకొని, PS తలుపులు మూయాలి.
  4. EVMs లోని CUs లోని క్లోజ్ బటన్స్ నొక్కాలి.
  5. 17A ఓటర్ల రిజిస్టరులో చివరిగా ఉన్న సీరియల్ నెంబరు కిందుగా నిలువుగీత గీచి, సంతకం చేసి, PA లతో సంతకాలు చేయించాలి.
  6. CUs లో బ్యాటరీలు Switch off చేయాలి.
  7. BUs నుండి VVPATs కు అనుసంధానమైన కేబులును, VVPATs నుండి CUs కు లింక్ గా ఉన్న కేబుళ్లను Disconnect / తొలగించాలి.
  8. PO పోలింగ్ ముగింపు గురించి డిక్లరేషన్ వ్రాయాలి. PO డైరీ వ్రాయండి. అందులో ప్రతి కాలమ్ ను జాగ్రత్తగా వ్రాయాలి.తొందరపడవద్దు.
  9. EVMs సీలు చేయండి.

రిసెప్సన్ సెంటరులో క్రిందివి తప్పనిసరిగా ఇవ్వాలి

(1) Evms.
(2) Paper Seal Accounts.
(3) presiding officer Declaration.
(4) presiding officer Dairy.
(5) Staff Aquitaince rolls.(most probably s.o may take care of it.)

Pockets to be hand over in Reception centre

పాకెట్ నెం 1

(a) మార్క్ డ్ కాపీస్ ఓటర్ల జాబితా సీల్డ్ కవరు.
(b) ఓటర్ల రిజిస్టరు ( 17 A) sealed cover.
(c) HOP, APLA ఓటర్ల స్లిప్స్ వేరు వేరుగా ఉంచి సీలు చేసిన కవరు.
(d) unused tendered ballot papers.
(e) used tendered ballot papers with Form 17 B Seald cover.

పాకెట్ నెం 2.

(a) మార్క్ చేయబడని ఓటర్ల జాబితా.సీల్డ్ కవరు.
(b) పోలింగ్ ఏజంట్ల నియామకాలు చేసిన ఫారాలు. (ఫారం - 10.) సీల్డ్ కవర్.
(c) 12 B, EDC సీల్డ్ కవరు.
(d) ఫారం - 14 సీల్డ్ కవరు. ఛాలెంజ్డ్ ఓట్ల గురించి.
(e) అంధుల, వికలాంగుల గురించివున్న Form 14 A, & companion declaration, seal cover.
(f) ఓటర్ల వయస్సు గురించి తీసుకొన్న డిక్లరేషన్.Seal cover.
(g) ఛాలెంజ్ ఓట్లకు ఉన్న, ఇచ్చిన రశీదులు, వసూలైన డబ్బు వున్న కవరు.
(h) వాడని (unused) చెడిపోయిన (damaged) పేపరు సీళ్ళు.
(i) వాడని ఓటరు స్లిప్పుల కవరు.
( j ) వాడని చెడిపోయిన Strip Seals Cover.

పాకెట్ నెం 3

(1) presiding officer hand book.
(2) Manual of electronics Machins.
(3) చెరగని సిరా and cup
(4) stamp Pad.
(5) brass seal of PO ?
(6) రబ్బరు స్టాంపులు (crossed).

పాకెట్ 4

  • ఓటర్ల వయస్సు సంబంధించిన డిక్లరేషన్లు, సంచులు, వస్త్రం, RO చెప్పిన ఇతర పత్రాలు.
  • ఈ కవర్ల మీద నియోజకవర్గం పేరు, ని॥వ॥ నెంబరు, PS కేంద్రం పేరు, PS నెంబరు వ్రాయండి.
  • అంతా సిద్ధమైన తరువాత SO, Route officer, Escort తో ఇచ్చిన వాహనంలో ఆహ్వాన కేంద్రానికి (రిసెప్సన్ సెంటరుకు) రండి.
  • ఆహ్వానకేంద్రంలో క్యూలో వెళ్ళి అన్ని రికార్డులు, Evms, ఇతర సామాగ్రి ఇచ్చి రశీదు పొందండి.
  • చివరిగా నా మాట ప్రిసైడింగ్ ఆఫీసరు ధైర్యంగా, డైనమిక్ గా, తెలివిగా ప్రవర్తిస్తే పోలింగ్ సులభంగా జరిగిపోతుంది.

ప్రిసైడింగ్ అధికారులు hand book లోని క్రింది ఫారాలు పైనా, అనెక్జర్స్ పైనా పూర్తి అవగాహన కలిగి వుండాలి

1. Annexure .4 :  Form M 24 Receipt of returning of election records and material లోకసభకు రెండు, శాసనసభకు రెండు వ్రాయాలి.
2. Annexure 5 : Declarations of the presiding officer Parts 1,2,3,and 4.
3. Annexure 6 : Letter of complaint to the station house officer of police.
4. Annexure 7 : Form of declaration by voter about his age.
5 . Annexure 5 : Receipt book for challenged votes.
6. Annexure 9 : List related to under aged voters.
7. Annexure 10 : Declarations of the companion of blind and infirm voter.
8. Annxure 11 : Form 17C about recorded votes.
9. Annexure 12 : PO Diary (not Dairy).
10. Annexure 13 : Format for presiding officer's additional information to Observer with 16 columns.
11. Annexure 14 (Important) : Mock poll certificate.
12. Annxure 15 :  Declaration of the voetr under Rule No 49M.VVPATs లోని స్లిప్స్ పై వోటరు అనుమానం వ్యక్తం చేస్తే, VVPATs పనితనం నిరూపణకు ముందు Presiding offier, సందేహం వ్యక్తం చేసిన ఓటరు నుండి తీసుకొనే డిక్లరేషన్.

13. Annexure 16 : Form of Declaration by a elector whose name is in ASD lists. Absent, Shifted,and Death
ఓటర్ల జాబితాలో పెర్కొనబడిన ఓటరు ఓటు వేయటానికి వచ్చినపుడు, PO ఆ ఓటరు దగ్గర తీసుకొనే డిక్లరేషన్.
14. Annexure 17 : Movement record for polling agents and relieving polling agents .
15. Annexure 18 : Suggestions about VVPATs and EVMs evms..read and follow.
16. Annexure 19 : About polling material to receive at Distribution centre.
17. Annxure 20 : Check memo for PO
18. Form 17 A : voters Register.
19. Form 10 : Appointment of polling agents by candidate or Election Agent.
20. Form 11 : Revocation of polling Agent by Candidate or Election Agent.
21. Form 13 : Request for Postal Ballot paper by election personnel.
22. Form 12 B : Request for EDC.
23. Form 14 : List of challenged votes.
24. Form 15 : List of tendered votes.
25.Form 17B : Record of tendered ballot papers.
26.Form 13A, 13B, 13C, 13D : Information about postal ballot papers and postal ballot paper.

Download for Duties of Presiding Officers 2019 
Election Duty Officers Training Manual Download 

PO Hand Book Elections 2019 in Telugu | Duties of Presiding Officers. Duties of polling officers, PO Submit Forms and Covers list Download.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 17, 2019

0 comments:

Post a Comment