RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Amma Vodi Scheme Guidelines by AP Govt. Official | Amma vadi 15000 Instructions

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Saturday, July 13, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Amma Vodi Scheme Guidelines by AP Govt. Official | Amma vadi 15000 Instructions 

Amma Vodi Scheme Guidelines by AP Govt. Official | Amma vadi 15000 Instructions download. Amma Vodi Scheme clarity by AP Govt. Official Press Note  : CMO Office press statement on Amma Vadi scheme - అమ్మఒడి పధకంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.అమ్మఒడిపధకంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.అమ్మఒడి పధకం అమలుపై వస్తున్న సందేహాలు,అపోహలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం. పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా అమ్మఒడి పధకం వర్తిస్తుంది. ఆ పిల్లలు చదివేది ప్రైవేటు స్కూల్ అయినా,ప్రభుత్వ స్కూల్ అయినా అమ్మఒడి వర్తిస్తుంది.ప్రభుత్వం స్పష్టత ఇచ్చారు.



Amma Vodi Scheme Guidelines by AP Govt. Official | Amma vadi 15000 Instructions 

Amma Vodi Scheme clarity by AP Govt. Official Press Note
Amma Vodi Scheme clarity by AP Govt. Official Press Note 
అమ్మఒడి పథకం అందరికీ బదులుగా అర్హులైన ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేదలకే ఇవ్వడం మంచిదా? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే వాళ్లకే ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు పలువురు మంత్రులు వ్యాఖ్యలు ద్వారా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఎక్కడ చదువుతున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికీ ఏటా రూ. 15 వేలు సాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకే జగన్ కట్టుబడినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలలో చదివే విద్యార్థుల తల్లికి ఈ పథకం కింద డబ్బు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. పేద విద్యార్ధులు అందరికీ వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.
పేద ప్రజలు చదివేది ఏ బడి అనేది సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ ఈ అమ్మఒడి పథకం అమలు చేయాలని నిర్ణయించింది. నిరుపేదలైన ఎందరో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో నిరుపేదలే అధికం.


అయితే పేదల్లో కూడా కొందరు కష్టపడి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పథకం అంటే అనేకమంది నష్టపోతారని, చదివించేందుకు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం జగన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

‘అమ్మ ఒడి’ ఒకరికే

♦ కుటుంబంలో పిల్లలెందరున్నా తల్లికే.
♦ బడ్జెట్‌లో 6455.80 కోట్లు కేటాయింపు
♦ ఒకటి నుంచి పది, ఇంటర్‌ కలుపుకొని
♦ 43 లక్షలమందికి రూ.15వేలు చొప్పున
♦ తెల్ల రేషన్‌ కార్డు ఉండటం తప్పనిసరి

నవరత్నాల్లో ఒకటైన ‘అమ్మఒడి’ పథకం కోసం బడ్జెట్‌లో రూ.6455.80 కోట్లు కేటాయించారు. ఇందులో ఒకటి నుంచి పదోతరగతి వరకు పిల్లలకు రూ.5,595 కోట్లు, ఇంటర్‌ విద్యార్థులు రూ.860 కోట్లు అందజేస్తారు. ఒక కుటుంబంలో చదివే పిల్లలు ఎందరున్నా, తల్లికి మాత్రమే ఈ పథకం లబ్ధిని అందిస్తామని శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తాం’ అని వెల్లడించింది. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తింపజేయాలని సర్కారు తొలుత భావించింది. అయితే ఆ తర్వాత ఇంటర్మీడియెట్‌ వరకు ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు 70 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియెట్‌ కోర్సును సుమారు 10లక్షలమంది చదువుతున్నారు. అయితే వీరిలో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, అంటే తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండటం, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ తల్లికే లబ్ధి చేకూర్చేలా ఈ పథకం నిబంధనలను రూపొందించారు.
Amma Vodi Scheme 15000 Guidelines by AP Govt., AP Amma Vodi Scheme Guidelines, Instructions to Officials.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 13, 2019

0 comments:

Post a Comment