RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Central Budget 2019 Highlights | Nirmala Sitharaman Budget 2019 in Telugu

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Friday, July 5, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Central Budget 2019 Highlights | Nirmala Sitharaman Budget 2019 in Telugu 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెడుతున్న మహిళా మంత్రి సీతారామనే కావడం విశేషం. బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయానికి సీతారామన్ స్వస్తి పలికారు.



Central Budget 2019 Highlights | Nirmala Sitharaman Budget  2019 in Telugu 

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ 2019-20ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఏన్డీఏ-2 తొలి ప్రభుత్వ బడ్జెట్‌ను ఆమె సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2014-15తో పోలీస్టే ఆహార భద్రతకు రెట్టింపు నిధులు కేటాయించామన్నారు.



కేంద్ర బడ్జెట్‌ 2019-20 Highlights in Telugu

  1. పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయి అదనపు సుంకం.
  2. -బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50 శాతానికి
  3. -డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు చర్యలు.
  4. -డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు రద్దు.
  5. -డిజిటల్ చెల్లింపులపై ఖాతాదారులు, వ్యాపారుల వద్ద ఛార్జీలు రద్దు.
  6. -బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ. కోటి నగదు ఉపసంహరణ పరిమితి.
  7. -ఉపసంహరణ పరిమితి రూ. కోటి దాటితే 2 శాతం టీడీఎస్
  8. -మధ్య తరగతి గృహ రుణాలపై కాస్త ఊరట.
  9. -వడ్డీ రాయితీ రూ. 2 లక్షల నుంచి రూ. 3.50 లక్షలకు పెంపు.
  10. రూ. 45 లక్షల లోపు గృహ రుణాలపై రూ. 3.50 లక్షలు వడ్డీ రాయితీ.
  11. -రూ. 5 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  12. -వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు.
  13. -పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డుతో ఐటీ రిటర్నుల దాఖలుకు అవకాశం.
  14. -వార్షిక ఆదాయం రూ. 5 కోట్లు దాటిన వారికి సర్ ఛార్జి పెంపు
  15. -విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తెచ్చే ఆలోచన ఉంది.
  16. -ప్రస్తుతం ఆ అంశం జీఎస్టీ మండలి పరిశీలనలో ఉంది.
  17. -త్వరలో కొత్త సిరీస్ లో 1, 2, 5, 10, 20 రూపాయాల కొత్త నాణేలు విడుదల.
  18. -అంధులు కూడా గుర్తించే విధంగా కొత్త నాణేలు విడుదల.
  19. -వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల రంగానికి రూ. 100 లక్షల కోట్లు.
  20. -ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది.
  21. -ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకుండా పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తాం.
  22. -పెట్టుబడుల ఉపసంహరణతో 2019-20లో రూ. లక్షా 5 వేల కోట్ల సమీకరణ లక్ష్యం.
  23. -దేశ విదేశీ అప్పులు జీడీపీలో 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
  24. -బ్యాంకింగ్ రంగం ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం.
  25. -నూతన దివాళా చట్టం ద్వారా దేశవ్యాప్తంగా రూ. 4 లక్షల కోట్లు మొండి బకాయిలు వసూళ్లు.
  26. -ఆరు ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాం.
  27. -రుణపరిమితి పెంచేందుకు బ్యాంకులకు రూ. 70 వేల కోట్లు
  28. -అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం.
  29. -రైతుల ఆదాయం రెట్టింపునకు జీరో బడ్జెట్ ఫార్మింగ్ కు ప్రాధాన్యం.
  30. -భారత్ పాస్ పోర్టు ఉన్న ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు అందిస్తాం.
  31. -స్వదేశానికి వచ్చాక 180 రోజుల కాలవ్యవధి నిబంధన తొలగింపు.
  32. -స్వదేశానికి రాగానే ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటాం.
  33. -ఆఫ్రికా దేశాల్లో 18 రాయబార కార్యాలయాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి.
  34. -ఇప్పటికే 5 దేశాల్లో రాయబార కార్యాలయాలు ప్రారంభం.
  35. -దేశ వ్యాప్తంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
  36. -17 పర్యాటక కేంద్రాలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు.
  37. -కృత్రిమ మేధ, బిగ్ డేటా, రోబోటిక్స్ రంగాల్లో యువత శిక్షణకు ఏర్పాట్లు.
  38. -స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు్.
  39. -ప్రతి స్వయం సహాయ బృందంలో ఒక్కో మహిళకు రూ. లక్ష వరకు ముద్ర రుణం.
  40. -జన్ ధన్ ఖాతా ఉన్న మహిళకు రూ. 5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం.
  41. -ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35 కోట్ల ఎల్ఈడీ బల్సుల పంపిణీ.
  42. -ఎల్ఈడీ బల్బుల ద్వారా రూ. 80 వేల కోట్ల విలువైన విద్యుత్ ఆదా.
  43. -రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు భారీ ప్రాజెక్టులు చేపడుతాం.
  44. -స్వచ్ఛ భారత్ అభియాన్ కింద గ్రామీణ ప్రాంతాల ఘన వ్యర్థాల నిర్వహణ.
  45. -గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలది ప్రత్యేక పాత్ర.
  46. -మహిళల ప్రోత్సాహకంతోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వెలుగులు
  47. -సోషల్ ఎంటర్ ప్రైజెస్ కు చేయూతకు ఎలక్ర్టానిక్ విధానంలో నిధుల సేకరణకు ప్రత్యేక వేదిక.
  48. -సోషల్ స్టాక్ ఎక్సేంజీ పేరుతో ఎలక్ర్టానిక్ విధానంలో నిధుల సేకరణ.
  49. -ప్రస్తుతం లోక్ సభలో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు.
  50. -దేశవ్యాప్తంగా వృత్తి కళాకారుల కోసం స్ఫూర్తి పేరుతో క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం.
  51. -స్ఫూర్తి క్లస్టర్ల ద్వారా 50 వేల మంది వృత్తి కళాకారులకు లబ్ధి జరుగుతుంది.
  52. -స్టాండప్ పథకం ద్వారా 300 మంది వ్యాపారవేత్తలు వెలుగులోకి వచ్చారు.
  53. -దళితులు, గిరిజనుల కోసం స్టాండప్ ఇండియా కింద పెట్టుబడి సాయం.
  54. -దేశ వ్యాప్తంగా 10 వేల రైతు సంస్థలు ఏర్పాటు.
  55. -శ్రమయోగి మాన్ ధన్ యోజన ద్వారా 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ. 3 వేలు పింఛను.
  56. -గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు విస్తృత ప్రాధాన్యం కల్పిస్తాం.
  57. -2019-20 ఆర్థిక సంవత్సరంలో 80 జీవనోపాధి వ్యాపార అంకుర సంస్థలు ఏర్పాటు.
  58. -2019-20లో 20 సాంకేతిక అంకుర సంస్థలు ఏర్పాటు.
  59. -యాస్పెర్ పథకం ద్వారా 75 వేల మంది నైపుణ్యవంతులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను
  60. తీర్చిదిద్దుతాం.
  61. -స్టార్టప్ ల కోసం ప్రత్యేక టీవీ ఛానల్.
  62. -స్టార్టప్ లు, ఆవిష్కరణల ప్రోత్సాహకానికి టీవీ ఛానల్.
  63. -ఏడాదిలోగా ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు.
  64. -ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తాం.
  65. -ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా కోటి మందికి నైపుణ్యాభివృద్ధి.
  66. -దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు.
  67. -ఐదేళ్ల కిందట ప్రపంచ అత్యుత్తమ 200 విద్యా సంస్థల్లో భారత్ నుంచి ఒక్కటి కూడా లేదు.
  68. -ఐదేళ్లలో నిరంతర శ్రమతో ఇప్పుడు మూడు విద్యాసంస్థలు 200 లోపు ర్యాంకుల్లో ఉన్నాయి.
  69. -ఉన్నత విద్యా కేంద్రంగా ఎదిగేందుకు భారత్ కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
  70. -మన ఉన్నత విద్యా సంస్థల్లోకి విదేశీ విద్యార్థుల రాక మరింత పెరగాలి.
  71. -ఉన్నత విద్యలో సంస్కరణల కోసం నూతన విద్యా విధానం.
  72. -పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు.
  73. -నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ప్రత్యేక నిధులు.
  74. -నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలకు చేయూతనిస్తాం.
  75. -ఉన్నత విద్యలో బోధన మెరుగుకు జ్ఞాన్ పథకం.
  76. -స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా 9.6 కోట్ల శౌచాలయాల నిర్మాణం.
  77. -5.6 లక్షల గ్రామాలను ఓడీఎఫ్ గా ప్రకటించాం.
  78. -అక్టోబర్ 2 నాటికి ఓడీఎఫ్ భారత్ గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పం.
  79. -మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా దేశం ఇచ్చే కానుక అదే.
  80. -ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత యోజన ద్వారా 2 కోట్ల మంది గ్రామీణ యువతకు శిక్షణ అందించాం.
  81. -శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తున్నాం.
  82. -దేశ వ్యాప్తంగా పట్టణ పేదల కోసం 81 లక్షల ఇళ్ల నిర్మాణం.
  83. --ఇప్పటికే 24 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ.
  84. -గ్రామీణ సడక్ యోజన ద్వారా రూ.80,250 కోట్లతో 1.25 లక్షల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం.
  85. -ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి 30 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం.
  86. -మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన.
  87. -విమానయానం, మీడియా, యానిమేషన్ రంగాల్లో ఎఫ్ డీ ఏల ప్రతిపాదనలపై పరిశీలన.
  88. -రైతు ఉత్పత్తి సంఘాలకు మరింత చేయూతనిస్తాం.
  89. -వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు పూర్తి సహాయ సహకారాలు.
  90. -పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినందుకు రైతులకు ధన్యవాదాలు.
  91. -పప్పు ధాన్యాల ఉత్పత్తిలో రైతులు స్వయం సమృద్ధి సాధించి దిగుమతుల భారం తగ్గించారు.
  92. -జలవనరుల విభాగాలన్నీ సమీకృతం చేస్తూ జల్ శక్తి మంత్రాలయ్ ఏర్పాటు.
  93. -జలజీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికీ రక్షిత నీరు.
  94. -ఇప్పటికే ఉన్న రాష్ర్టాల పథకాలతో కలిసి లక్ష్యం దిశగా జలజీవన్ ఉంటుంది.
  95. -వాననీటి సంరక్షణ, గృహ నీటి శుద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం.
  96. -ఇక నుంచి వచ్చే నీటిని తిరిగి సాగు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం.
  97. -256 జిల్లాల్లో జల్ శక్తి అభియాన్.
  98. -ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చేందుకు 3 అంశాలపై దృష్టి పెట్టాం.
  99. -మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు మొదటిది.
  100. -డిజిటల్ ఎకానమీ, ఉపాధి కల్పనకు తదుపరి ప్రాధాన్యం.
  101. -స్టాక్ మార్కెట్ లో ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు వెసులుబాటు.
  102. -ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు.
  103. -ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది.
  104. -ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ.
  105. -గ్రామాలు, పేదరికం, రైతులే మన గ్రామీణ భారతం.
  106. -గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు.
  107. -ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి విద్యుత్.
  108. -2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి విద్యుత్ సౌకర్యం.
  109. -2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లబ్ధి.
  110. -ఇప్పట్నుంచి 2022 వరకు 1.95 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తాం.
  111. -చిల్లర వ్యాపారులకు నూతన పింఛన్ పథకం.
  112. -ప్రధానమంత్రి కర్మయోగి మాన్ ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్.
  113. -దేశానికి విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగుతోంది.
  114. -అన్ని దేశాల్లో ఎఫ్ డీ ఐలు తగ్గినప్పటికీ భారత్ పై ఆ ప్రభావం పడలేదు.
  115. -ఎఫ్ డీ ఐల ఆకర్షణకు భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం.
  116. -ప్రపంచంతో పోలిస్తే భారత్ కు ఎఫ్ డీ ఐలు మెరుగ్గా ఉన్నాయి.
  117. -ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా రైల్వేల్లో నూతన విధానం.
  118. -2030 నాటికి రైల్వేల మౌలిక వసతుల కోసం రూ. 50 లక్షల కోట్లు అవసరం.
  119. -రహదారి, రైల్వే ప్రయాణికులకు ఒకే కార్డును ఉపయోగించుకోవచ్చు.
  120. -అదే కార్డుతో ఏటీఎంలలో నగదు కూడా తీసుకోవచ్చు.
  121. -భారత్ మాల, సాగర్ మాల, ఉడాన్ పథకాలు గ్రామీణ - పట్టణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించనున్నాయి.
  122. -భారత్ మాల పథకం ద్వారా రహదారులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం.
  123. -నవ భారత్ నిర్మాణానికి 10 సూత్రాల విధానంతో ముందుకెళ్తాం.
  124. -దేశ రవాణా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాం.
  125. -రవాణా వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా నేషనల్ ట్రాన్స్ పోర్టు కార్డు తెస్తున్నాం.
  126. -పవర్ టారిఫ్ పై త్వరలో కొత్త విధానం తీసుకువస్తాం.
  127. -ఎంఎస్ఎంఈలకు రాయితీ కోసం రూ. 350 కోట్ల నిధులు.
  128. -ఎంఎస్ఎంఈలకు నిరంతర ఆర్థిక వెసులుబాటు కోసం ప్రత్యేక పథకం.
  129. -వన్ నేషన్, వన్ గ్రిడ్ విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా.
  130. -వృద్ధి రేటు పెంచేందుకు భారీగా మౌలిక వసతులు ప్రాజెక్టులు చేపట్టాం.
  131. -దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక వసతుల ప్రాజెక్టులు జీవనరేఖలు.
  132. -భారతీయ సంస్థలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తున్నాయి.
  133. -మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ మా విధానం.
  134. -పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం.
  135. -నూతన అద్దె చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం.
  136. -దేశంలో 2018-19 మధ్య 300 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం.
  137. -దేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి 657 కిలోమీటర్లు నిర్మితమై ఉంది.
  138. -విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం.
  139. -దేశ వ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం.
  140. -జలమార్గ్ వికాస్ పథకంతో అంతర్గత జల రవాణాకు అధిక ప్రాధాన్యం.
  141. -రోడ్లు, రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గించేందుకు జలమార్గ్ వికాస్.
  142. -గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం.
  143. -పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం.
  144. -ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం.
  145. -దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలకపాత్ర పోషిస్తుంటాం
  146. -5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
  147. -ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
  148. -ప్రస్తుతం భారత్ 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశం.
  149. -జాతీయ భద్రతకు ప్రజలు ఆమోదం తెలిపారు
  150. -3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది.
  151. -ప్రత్యక్ష పన్నులు, రిజిస్ర్టేషన్ లో అనేక మార్పులు తెచ్చాం.
  152. -ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం, స్వచ్ఛభారత్ నిర్మితమైంది.
Central Budget 2019 Highlights | Nirmala Sitharaman Budget 2019 in Telugu.Main Points కేంద్ర బడ్జెట్‌ 2019-20 Highlights in Telugu.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 05, 2019

0 comments:

Post a Comment