Ananda Vedika Level 1, 2, 3, 4 Activities on 20th, 21st August, 2019 | AV 1st to 10th Class
AP Schools Conduct Ananda Vedika Level wise Activities on 20th and 21st August, 2019 | Level 1,2,3 and 4 for Primary Tsudents, Upper Primary Students and High School Students Ananda Vedika Activities download. Dr Manohar Rao Prepared Ananda Vedika Level wise Activities Download. 1-2-3-4 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో, పైన ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..పాటలంతా కమణీయంగా జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే! ముందుగా 3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.Ananda Vedika Level 1, 2, 3, 4 Activities on 20th, 21st August, 2019 | AV 1st to 10th Class
ఏకాగ్రతతో వినడం
సమయం : 25 నిమిషాలు నుండి 30 నిమిషాలుఉద్దేశ్యం :
విద్యార్థులు పరిసరాల ధ్వనుల పట్ల ఏకాగ్రత కలిగి ఉండి వాటిని గమనించడం.శ్వాస మీద ధ్యాస :
• ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోమనాలి.• శ్వాస మీద ధ్యాస కేంద్రీకృతం కాదు. మరలా మరలా శ్వాస మీద ధ్యాసను కేంద్రీకరించాలి.
కార్యాచరణ సోపానాలు :
• విద్యార్థులు ప్రశాంతంగా కూర్చొని పరిసరాల నుండి వచ్చే ధ్వనులను వినమనాలి.• విద్యార్థులందరూ కళ్ళుమూసుకొని కూర్చోవాలి. పరిసరాల నుండి వచ్చే ధ్వనులను వినమనాలి. ఎవరికైనా కళ్ళు మూసుకోవడంలో ఇబ్బంది కలిగితే వారు క్రిందివైపు చూస్తూ కూర్చోమనాలి. కళ్ళు మూసుకున్న తర్వాత తరగతిలోకి వచ్చు విభిన్న ధ్వనులు విసమనాలి.
ఉదాహరణ : ఫ్యాను, ట్రాఫిక్, బయటవారి మాటలు, పిల్లల నవ్వులు, అల్లరి శబ్దాలు ప్రకృతి నుండివచ్చే శబ్దాలు మొదలైనవి.
• తమ ఏకాగ్రతను పరిసరాల నుంచి వచ్చు ధ్వనులపై నిలపాలి. వచ్చే ధ్వనులు మంచివైనా, చెడువైనా ఏదైనా వినాలని చెప్పాలి.
ఉపాధ్యాయుడు విద్యార్థులతో చర్చించవలసిన అంశాలు :
• ఈ ప్రక్రియ చేసే సందర్భంలో మీ అనుభవాలేమిటి ?• మీరు మీ శ్వాస ధ్వనిని వినగలిగారా ?
• ఈ ప్రక్రియ చేయడం మనకు సులభంగానే అన్పించిందా ?
• ఎవరికైనా ఏకాగ్రత అంతరాయం కల్గిందా ?
గుర్తుంచుకోవలసిన అంశాలు:
• తమ పరిసరాల ధ్వనుల పట్ల ఏకాగ్రత నిలపాలి. తద్వారా విద్యార్థుల ధ్యాసను వినడంవైపు మళ్ళించవచ్చు.మౌన ప్రక్రియ:
• మీరు ఏ ఏ ధ్వనులు విన్నారు ?• 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యాన ప్రక్రియ కొనసాగించాలి.
• విద్యార్థులు కళ్ళు మూసుకుని ఉంటారా లేక కళ్ళు తెరచి క్రిందికి చూస్తారా అనేది వారి వారి ఇష్టానికి వదిలేయాలి. ఈ ప్రక్రియను మీ కుటుంబ సభ్యులతో కలసి చేయమనాలి.
Download Ananda Vedika August 20, 21 - LEVEL-1,2.pdf
Download Ananda Vedika August 20,21 - LEV-3.pdf
Download Ananda Vedika August 20,21 - LVE-4.pdf
0 comments:
Post a Comment