Daily life Science Questions with Answers for Students | కొన్ని సైన్స్ ప్రశ్నలకు సమాధానాలు
Can't shown the stars day time? Are the stars really smaller than the sun? Why do crescent and rabbit shapes appear on the moon? How are the moon spots formed? How did the moon turn round on the full moon day? Where does he go on new moon day? హైస్కూల్ విద్యార్థుల కోసం, నేను సేకరించిన కొన్ని సైన్స్ ప్రశ్నలకు సమాధానాలు మరియు ఒక సైన్స్ ప్రయోగం. రోజు... ప్రశ్నలు... ప్రయోగం.. ఆసక్తి ఉన్నవారు...ఉపయోగించుకోగలరు.Daily life Science Questions with Answers for Students | కొన్ని సైన్స్ ప్రశ్నలకు సమాధానాలు
జ.సూర్యకాంతి ఎక్కువగా ఉండడం, నక్షత్రకాంతిని కన్ను నేరుగా గమనించలేకపోవడం వల్ల ,పగలు నక్షత్రాలు కనిపించవు.
2.నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి? గ్రహాలు ఎందుకు మెరవవు?
జ. నక్షత్రకాంతి చాలా దూరం నుండి అనేకరకాల సాంద్రతలలోని యానకాలగుండా వక్రీభవనం చెందుతూ ప్రయాణించి రావడం వల్ల మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. గ్రహాలు నక్షత్రాల కంటే చాలా దగ్గరగా ఉన్నాయి.అవి సూర్యకాంతిని సరాసరి పరావర్తనం చెందిస్తున్నాయి.
3.సూర్యుడి కంటే నక్షత్రాలన్నీ నిజంగా చిన్నవేనా?
జ.చాలా నక్షత్రాలు సుర్యునికంటే ఎన్నోరెట్లు పెద్దవి.కాని సూర్యుని కంటే ఎన్నో రెట్లు దూరంలో ఉండటం వల్ల అవి చిన్నగా కనిపిస్తాయి.వీధీలో వరుసగా ఉన్న లైట్లను చూస్తే దూరంలో ఉన్న లైట్లకంటే , దగ్గరగా ఉన్నవి పెద్దగా కనిపిస్తాయి.
4.చంద్రునిపై ముసలమ్మ,కుందేలు ఆకారాలు ఎందుకు కనిపిస్తాయి?
జ.చంద్రునిపై ఉన్న కొండలు,లోయలవల్ల ఏర్పడ్డ నీడలబొమ్మలు మనకు ఇలాంటి ఆకారాలలో కనిపిస్తాయి.
5.చంద్రకళలు ఎలా ఏర్పడతాయి?
జ.సూర్యకాంతి చంద్రునిపై పడినపుడు ఒకవైపు కాంతి వంతంగా, మరోవైపు చీకటిగా ఉంటుంది.భూమిపైనుండి చూస్తే చంద్రుడు ఏకోణంలో కనిపిస్తాడో దాన్ని బట్టి ఆనాటి చంద్రకళ ఉంటుంది. 6.చంద్రునికి కాంతి ఎలా వస్తోంది?
సూర్యకాంతి పరావర్తనం చెందడం వల్ల చంద్రునికి కాంతి వస్తుంది...
7.పౌర్ణమి రోజు చంద్రుడు గుండ్రంగా ఎలా మారాడు?. అమావాస్య రోజున ఎక్కడికి వెళ్తున్నాడు?
అమావాస్య రోజున వెలుతురు భాగం ఏ మాత్రం మనకు కనిపించదు... పౌర్ణమి రోజున వెలుతురు భాగం పూర్తి స్థాయిలో మనకు అభిముఖంగా ఉంటుంది.
8.ప్రతీ పౌర్ణమి కీ,ప్రతీ అమావాస్య కు గ్రహణాలు ఎందుకు రావు?
భూమి,సూర్యచంద్రులు ఒకే సరళరేఖలో ఉండడం ,ప్రతీ పౌర్ణమి కీ,ప్రతీ అమావాస్య కు జరగదు..అలా జరిగితే నే గ్రహణాలు ఏర్పడుతాయి.సూర్యుని చుట్టూ భూమి తిరిగే , కక్ష్యా తరానికి,5డిగ్రీల కోణం తేడాతో చంద్రుడు,భూమి కక్ష్య ఉంటుంది.
9.కార్తులను ఎలా లెక్కిస్తారు?
సూర్యుడు ఏ నక్షత్రం సమీపంలోని ప్రాంతంలో ఉదయిస్తున్నట్టుగా ఎన్నిరోజులు కనిపిస్తాడో ఆ కాలాన్ని ఒక కార్తెగా ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు..
10.ఆకాశం నుండి భూమి ఏరంగులో కనసడుతుంది?
నీలంరంగు..
11.గ్రహణాలను చూసేందుకు మార్గం ఏది?
గ్రహణసమయంలో ఏర్పడే తాత్కాలిక చీకటి కి,కంటిలో కనుపాప విచ్చుకుంటుంది.. అలాంటప్పుడు సూటిగా ఒకటి,రెండు తీక్షణ కిరణాలు పెడితే మాత్రం ప్రమాదం.కానీ కళ్ళకు నల్లకళ్ళద్దాలు (ప్రత్యేక మైనవి)ధరించి చూడటం చేయవచ్చు..
12.తోకచుక్కలో తోక ఏమిటి?
సూర్యునికి 3ఆస్ట్రనామికల్ యూనిట్లు దూరంలో ఉన్నప్పుడు మాత్రమే తోక ఏర్పడుతుంది.తోక సూర్యునికి వ్యతిరేకంగా దిశలో ఉంటుంది.ఈ తోక సూర్యకిరణాలవల్ల చెదరగొట్టబడి దూరంగా నెట్టివేయబడుతున్న వాయువులు..ధూళికణాలు.. సూర్యునికి దగ్గరగా వస్తున్న కొద్దీ సూర్యరశ్మి తీక్షణత పెరిగి, వాయువులు వ్యాకోచం చెంది ధూళి కణాలు ఎక్కువగా నెట్టి వేయబడి తోక పెద్దదిగా అవుతుంది.. తోకచుక్క నిజానికి ఒక నక్షత్రం కాదు.. అమ్మోనియా, కార్బన్ డయాక్సైడ్ వంటి పదార్థాలు గడ్డకట్టి ఒక మురికి మంచుగడ్డలా తోకచుక్క ఉంటుంది. 13.కాంతి సంవత్సరం,ఆస్ట్రనామిక్ యూనిట్ అంటే ఏమిటి?
కాంతి ఒక సంవత్సరం లో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు.
సూర్యునికి,భూమికి గల సగటుదూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు. 14.భూమి గుండ్రంగా ఉంటే అంచుల వెంబడి నీరు కారిపోదేం?భూమి కింద వైపు మనుషులు పడిపోరా?
భూమి ఆకర్షణ ఉపరితలం పై అన్నివైపులా సమానంగా ఉండడం వల్ల కారిపోవు..భూకేంద్రం దిశగా భూమ్యాకర్షణ శక్తి ఉంటుంది.అంటే ఉపరితలం లోని ప్రతీ వస్తువు కూడా కేంద్రం దిశగా ఆకర్షించడం వల్ల ,ఇది అంచు అనీ, చెప్పడం కుదరదు. 15ధృవాల దగ్గర మంచు, భూమధ్యరేఖ లో ఎడారులు ఎందుకుంటాయి?
సూర్యకిరణాలు భూమధ్యరేఖ వద్ద నిట్టనిలువుగా నూ,ధృవాలదగ్గర ఏటవాలుగా పడతాయి.. అందువల్ల మధ్యలో అత్యుష్ణంగా, ధృవాలు శీతలంగా ఉంటాయి.. 16.చంద్రునివైపుకెళ్తే మనం బరువు తగ్గుతుందా ఎంత?
చంద్రుని గురుత్వాకర్షణ,భూమి గురుత్వాకర్షణ లో 6వవంతు తక్కువ గా ఉంటుంది.అందువల్ల ఇక్కడ బరువుతో పోల్చుకుంటే 6వవంతు బరువు తక్కువగా ఉంటాము..
17.ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది?
సూర్యకాంతి లోని నీలిరంగు సులభంగా వాతావరణం లోని వివిధ కణాల చేత చెదరగొట్టబడటం వల్ల ఆ కాంతిలో ఆకాశం కనిపిస్తుంది.
Source from Satya Sudha Tlm Corner (facebook)
0 comments:
Post a Comment