RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

National Sports Day Dhyan Chand Jayanthi August 29 | Sports Day Details in Telugu

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, August 29, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

National Sports Day Dhyan Chand Jayanthi August 29 | Sports Day Details in Telugu

Hockey player Dhyan Chand Jayanthi on August 29, "National Sports Day" with good wishes. from Hockey is the only sport, We have the highest number of Olympics in history Hockey is the only sport to have won eight gold medals, Three gold medals from only wrist magician Dhyan Chand. ఆగస్టు 29...హాకీ క్రీడా కారుడు ధ్యాన్ చంద్ జయంతి -"జాతీయ క్రీడాదినోత్సవం" శుభాకాంక్షలతో. Top sports awards on the same day, Awarding of Rajiv Khel Ratna, Arjuna and Dhyan Chand Awards.




National Sports Day Dhyan Chand Jayanthi August 29 | Sports Day Details in Telugu

  1. ఒకే ఒక్క క్రీడ హాకీ : ఒలింపిక్స్ చరిత్రలోనే మనకు అత్యధికంగా..ఎనిమిది బంగారు పతకాలు అందించిన ఒకే ఒక్క క్రీడ హాకీ.
  2. అందులో మూడు బంగారు పతకాలు సాధించిన రికార్డు.. మణికట్టు మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు మాత్రమే ఉంది.
  3. 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్, 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో భారత్ వరుసగా మూడు బంగారు పతకాలు గెలుచుకోడంలో ధ్యాన్ చంద్ ప్రధానపాత్ర పోషించారు.
  4. బెర్లిన్ ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ ఆటతీరు, స్టిక్ వర్క్, మణికట్టు మాయాజాలాన్ని చూసి..అలనాటి నాజీ నియంత హిట్లర్ సైతం మంత్రముగ్దుడై పోయాడు.

National Sports Day Dhyan Chand Jayanthi August 29 | Sports Day Details in Telugu

➥అప్పటికే భారత్ లోని బ్రిటీష్ ఆర్మీలో సిపాయి హోదాలో ఉన్న ధ్యాన్ చంద్ కు మేజర్ హోదా ఇస్తానంటూ ఆశ పెట్టాడు, జర్మన్ సైన్యంలో చేరాలంటూ ప్రలోభ పెట్టాడు. అయితే ధ్యాన్ చంద్ మాత్రం..జర్మన్ సైన్యంలో మేజర్ హోదా కంటే..భారత సైన్యంలో సిపాయిగా ఉండటమే తనకు గౌరవమని సమాధానం చెప్పి..తన దేశభక్తిని చాటుకొన్నారు.ఆదేశభక్తుడు, హాకీ చాంపియన్ ద్యాన్ చంద్ గురించి.
➥1905, ఆగస్టు 29 –ఆయన జన్మదినం ..ఒకసారి తను గోల్ వేసిన తరువాత అది పడకపోతే తను గోల్ వేసిన విధానం విధంగా ఉన్నదని ఒకసారి గోల్పోస్ట్ కొలతలు సరిచూడవలసిందిగా అంపైర్ ను కోరగా అది సరియైన గుర్తింపుగా అందరి మన్ననలు పొందారు తద్వారా ఆయనకి ఆటమీద గల అభిమానం తెలియజేస్తుంది. .
➥ఆగస్టు 29...జాతీయ క్రీడాదినోత్సవమని...భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ను గౌరవిస్తూ..ఆ మహనీయుడి జయంతి రోజునే స్పోర్ట్స్ డే వేడుకలు జరుపుకొంటామని.. నేటిమన నవయుతరంలో ఎంతమందికి తెలుసు ?.
➥మన వాతావరణానికి ఏమాత్రం సరిపడని వలెంటైన్స్ డే వంటి వాటికి మీడియా, స్పాన్సర్లు ఇస్తున్న ప్రాధాన్యం...జాతీయ క్రీడాదినోత్సవానికి ఏమాత్రం ఇవ్వడంలేదు. తన దేశగౌరవమే తన గౌరవమన్న స్పృహ రానురాను మనలో తగ్గిపోతోంది.
➥బ్రిటీష్ సిపాయిల ద్వారా... మనదేశంలోకి వచ్చిన హాకీ క్రీడకే .. ధ్యాన్ చంద్ మరో పేరుగా నిలిచాడు.
ప్రపంచ వ్యాప్తంగా...భారత్ కు, సాంప్రదాయ భారతహాకీకి గుర్తింపు తీసుకువచ్చాడు.
భారత హాకీకి ఖ్యాతి తీసుకురావడమేకాదు.
➥జాతీయ క్రీడారంగానికే స్ఫూర్తిగా నిలిచిన ధ్యాన్ చంద్..జన్మించిన రోజు.. ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
➥ఇదేరోజున దేశఅత్యున్నత క్రీడాపురస్కారాలు .. రాజీవ్ ఖేల్ రత్న, అర్జున, ధ్యాన్ చంద్‌ అవార్డులు ప్రదానం చేయడాన్ని ఓ ఆనవాయితీగా ఏర్పాటు చేసింది.


National Sports Day Dhyan Chand Jayanthi August 29 | Sports Day Details in Telugu. ఆగస్టు 29...హాకీ క్రీడా కారుడు ధ్యాన్ చంద్ జయంతి -"జాతీయ క్రీడాదినోత్సవం" శుభాకాంక్షలతో.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 29, 2019

0 comments:

Post a Comment