RCs

School Assembly Today News on 16th August, 2019 | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Friday, August 16, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
పాఠశాల అసెంబ్లీ నేటి వార్తలు

School Assembly Today News on 16th August, 2019 | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు in AP Schools and TS Schools

> సమయానికి దేవుడిలా ఆదుకున్నాడు: కర్ణాటకలో ఒక పన్నెండేళ్ల బాలుడు వరదల్లో మునిగిన బ్రిడ్జిపై అత్యవసరంగా అంబులెన్సు వెళ్లేందుకు దారి చూపి ఆరుగురు చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

> ధైర్యసాహసానికి ‘కీర్తి చక్రం’. సీఆర్‌పీఎఫ్‌ అధికారికి శాంతి పురస్కారం! ఆయన వయసు 38.. 23ఏళ్ల వయసులో దేశ సేవ చేయాలన్న తపనతో పోలీసులు ఉద్యోగంలో చేరారు. నిబద్ధత ఆయన నైజం. ధైర్యమే ఆయన ధైర్యం. 15 ఏళ్ల సర్వీసులో వివిధ ధైర్య సాహస పురస్కారాలు దక్కించుకున్న ఆ ధీరుడి పేరు హర్షపాల్‌ సింగ్‌.

> బాలీవుడ్‌ నటి విద్యా సిన్హా కన్నుమూత: బాలీవుడ్‌ నటి విద్యా సిన్హా (71) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. జుహూలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

> ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభం: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షలమంది వాలంటీర్లు ఇవాళ్టి నుంచి విధుల్లోకి వచ్చారు.

> పాక్‌తో గొంతు కలిపిన చైనా: జమ్ముకశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల చర్చించడానికి వీలైనంత త్వరగా ఐరాస భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) సమావేశం ఏర్పాటు చేయాలన్న పాకిస్థాన్‌ అభ్యర్థనకు పొరుగు దేశం చైనా సైతం గొంతు కలిపింది.



నేటి సుభాషితం

"నక్షత్రాలు లెక్కపెట్టడం ఎంత కష్టమో...నక్షత్రంలాగా వెలుగునిచ్చె ఒక మంచి స్నేహితుడిని పొందడం కూడా అంతే కష్టం."

"Mistake Increases Ur Experience And Experience Decreases Ur Mistakes, If you Learn From Ur Mistakes. Then Others Learn From Ur Success! Train Ur Mind To See The Good In Every Situation!"

మంచి పద్యం

అంత రంగ మందు అర్థించి నిష్ఠమై
కర్మ నిష్టుడైన ధర్మ పరుడు
జగతి నుద్ధరించ జరిపెడు జన్నంబు
పూర్తి యగును విమల కీర్తి మీర

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన "శ్రుతి సౌరభము" అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె

ప్రశ్న: గవర్నర్ అధికార నివాసగృహం ఏది?

జ: రాజ్‌భవన్


School Assembly Today News on 16th August, 2019 | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు, నేటి సుభాషితం, మంచి పద్యం, Today GK for School Students.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 16, 2019

0 comments:

Post a Comment