RCs

School Assembly Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, August 8, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
పాఠశాల అసెంబ్లీ నేటి వార్తలు

School Assembly Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు 

> భారత్‌తో సంబంధాలపై పాక్‌ కీలక నిర్ణయాలు: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర విభజనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన పాకిస్థాన్‌ భారత్‌లో దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది.


> దూసుకెళ్లిన బంగారం ధర. ఒక్క రోజే రూ. 1,113 పెరిగిన ధర : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా డిమాండ్‌ ఊపందుకోవడంతో పసిడి ధర జీవనకాల గరిష్ఠానికి చేరింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1,113 పెరిగి రూ. 38వేల మార్క్‌కు చేరువైంది.

> *భారత్ నుంచి సింధు మాత్రమే!: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణీల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది.

> ఏపీలో నేడు వైద్యసేవల బంద్‌. 9 నుంచి 15 వరకు  శాంతియుత ఆందోళనలు. ఎన్‌ఎంసీ బిల్లుకు నిరసనగా ఐఎంఏ రాష్ట్ర శాఖ నిర్ణయం: నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లుకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్రశాఖ ప్రకటించింది.

> 3-0తో టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్: గయానా వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

                      నేటి సుభాషితం


"జీవితం చాలచిన్నది. వైఫల్యాలకు క్రుంగకూడదు!! విజయాలతో అహం పెరుగకూడదు!!"
             
"Great minds discuss ideas, average minds discuss events, small minds discuss people."

                         మంచి పద్యం

*మోహమడుగంటె నశియెంచె అహము సగటు*
*నిర్మలంబయ్యె చుత్తము నిలకడగను*
*రాగభయములు, క్రోధమురాలి పోయె*
*దుఃఖ సుఖములు సమముగా దోచె సతము*

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన "శ్రుతి సౌరభము" అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు).

                            *నేటి జీ.కె*

ప్రశ్న: *'శ్యాద్వాదచల సింహ' అనే బిరుదు ఎవరిది?*


జ: *సోమదేవసూరి*
School Assembly Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు, నేటి సుభాషితం, మంచి పద్యం, Today GK for School Students.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 08, 2019

0 comments:

Post a Comment