RCs

School Prayer Content on 28th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Wednesday, August 28, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

School Prayer Content on 28th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

School Prayer 28th August, 2019 పాఠశాల అసెంబ్లీ - AP / Telangana Today's News, Good Poem, Today's Good News, Today's GK, Today's Good Word, Today's Good News, Today's Nationalism, National / International Days, Today's Child, Today's Story, The Great Man's Word, Today's Proverb etc for School Assembly on 28th August, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.



School Prayer Content on 28th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు

  1. భారత్‌లో విధ్వంసానికి పాక్‌ కుట్రలు: భారత సైనికులపై దాడులు నిర్వహించేందుకు పాకిస్థాన్‌ కుట్రలు పన్నుతోంది. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్‌ ఆర్మీ ఇప్పటికే దాదాపు 100కు పైగా ప్రత్యేక సర్వీస్‌ బృందాల(ఎస్‌ఎస్‌జీ) కమాండోలను మోహరించింది.
  2. భారత జనరిక్‌ మందులకు చైనా ఆమోదం: భారత్‌కు చెందిన జనరిక్‌ మందుల విషయంలో కఠిన నిబంధనలను చైనా సడలించింది. ఈ మేరకు సంబంధిత చట్టాన్ని సవరిచింది.
  3. భారత తొలి మహిళా డీజీపీ ఇక లేరు..: భారత తొలి మహిళా డీజీపీ కంచన్‌ చౌదరి భట్టాచార్య(72) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు.
  4. ఈతకు వెళ్లి ముగ్గురు అన్నదమ్ములు మృతి: కృష్ణా జిల్లా కంచికచర్లలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని పేరకలపాడులో ఈతకు వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు.
  5. 85 ఏళ్లు.. 7000 వికెట్లు.. ఇప్పుడు రిటైర్మెంట్‌: వెస్టిండీస్‌ దిగ్గజాలు వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌, జోయెల్‌ గార్నర్‌, ఫ్రాంక్‌ వోరెల్‌తో కలిసి ఆడిన సెసిల్‌ రైట్‌ ఎట్టకేలకు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రెండు వారాల్లో 85వ వసంతంలోకి అడుగు పెడుతుండటంతో ఆటకు దూరం అవుతున్నానని ప్రకటించారు.

మహానీయుని మాట

" సుత్తితో ఒక దెబ్బ వేయగానే రాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి.
ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధిoచదు. ఎడతెగని ప్రయత్నం కావాలి."

నేటీ మంచి మాట

" క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ
భవిష్యత్తు మనకు అనుకూలంగా మారుతుంది."

నేటీ సుభాషితం

"ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి"
"Darkness cannot drive out darkness; only light can do that. Hate cannot drive out hate; only love can do that."

మంచి పద్యం

సతము వెలుగొందునది దివ్య శాంతిసుమ్ము
రాగమి సుమింత లేకుండ యాచరించు
యజ్ఞమయ మైన కర్మమ్ము నందుసుమ్ము
ఋషులు చూపినదియ్య దమృతపుబాట

నేటీ ఆణిముత్యం

పాపంబులందు నెక్కుడు
పాపయు సుమీ! ధరిత్రిపై క్రోధగుణం
బే పారు, లోభమును, విని
యే పురుషుల బెడద గూడ దిలను కుమారా!

భావం:

ఓ కుమారా! ఎక్కువైన కోపం, లోభం అనే గుణాలు పాపాలన్నింటిలో చాలా ఎక్కువ పాపాలు. అందుకే ఎవరికీ బాధ కలగకుండా మసలుకో.

నేటీ సామెత

దున్నపోతు మీద వాన పడ్డట్టు

దున్న పోతు మీద వాన పడితే దానికి చాలా హాయిగా వుంటుంది. అంతవరకు కాస్తనన్నా తొందరగా నడిచేది వర్షంలో అసలు నడవదు. అనా నిదానంగా పనిచేసే వారి గురించి ఈ సామెత వాడతారు.

నేటీ జాతీయాలు

కాలు జారింది : తప్పటడుగు వేశాడని అర్థం
కాల్చుకు తింటున్నాడు : చాలా బాధిస్తున్నాడని అర్థం

ఉదా: వాడు నన్ను కాల్చుకు తింటున్నాడు/ ఎవరైనా ఒకరిని ఎక్కువగా బాధిస్తుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

నేటీ చిన్నారి గీతం

అమ్మా అమ్మా
అమ్మ అమ్మ నాన్న వచ్చె
నాన్న నాకు పలకతెచ్చె
పలక నేను పంతులుకిస్తె
పంతులు నాకు అ ఆ లిచ్చె
అ ఆ లు నేను అమ్మా కిస్తే
అమ్మ నాకు ముద్దు ఇచ్చె.

నేటీ కథ

మూడు రాళ్లు

ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు అతడు బాగా వృద్ధుడు ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి, ఇలా అన్నాడు , నాయనలారా.... నేను ఎంతోకాలం జీవించను ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, ఈ ఆస్తిని సంపాదించాను మిమ్మల్ని పెంచి పెద్దవాళ్లను చేశాను ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా... అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి సత్యమూర్తి తెలివైనవాడు.

నా వ్యాపారాభివృద్ధికి అతను ఎన్నో సలహాలిచ్చినవాడు అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి అప్పుడే నాకు మనఃశాంతి కలుగుతుంది అలా చేస్తామని నాకు మాటివ్వండి అన్నాడు అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులూ ప్రమాణం చేశారు కొద్దిరోజుల్లోనే నారాయణ మరణించాడు ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ, తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు ఆతృతగా వారు ఆ పెట్టెను తెరిచారు.

అందులో ఇంటి తాళాలు, మూడు రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి ఆ ఉత్తరం పైన సత్యమూర్తి మాత్రమే చదవాలి అని రాసి ఉంది సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు తర్వాత ముగ్గురి వైపు తిరిగి, అబ్బాయిలూ... ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు ఏంటది...? అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను ముందు ఆ మూడు రాళ్లను పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి మీకు ఏమైనా తోస్తే చెప్పండి అని అడిగాడు సత్యమూర్తి.

ఓస్ అదేమంత పెద్ద విషయం కాదు మీ ముగ్గురు మూడురాళ్లను వెనకేసుకోండి అంటే దుబారా ఖర్చులు మాని, మరింత సంపాదించండి అని చెప్పి ఉంటాడు అందువలన ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తే, మేం మరింత అభివృద్ధి చేసుకుంటాం అన్నాడు పెద్దకొడుకు అంతే కాదు మూడు రాళ్లలా ఎక్కువ తక్కువ కాకుండా, మూడు వాటాలు సమానంగా వేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు అన్నాడు రెండోవాడు .

ఇక మూడోవాడు, ఆ మూడు రాళ్లు పొయ్యికి గల మూడు రాళ్లు అంటే మూడు రాళ్లు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది అలాగే మేం ముగ్గురం కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని చెప్పడానికే ఆ మూడు రాళ్లు పెట్టాడు అని వివరించాడు. ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత, సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని వారికి చూపాడు అందులో ముగ్గురు అన్నదమ్ములు కలసిమెలసి ఉండాలి నా కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్నవారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని రాసి ఉంది.

చదివారు కదా మీ నాన్న ఉద్దేశాన్ని మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి తండ్రి ఉద్దేశం ఎరిగిన కొడుకే అతని కోరికను నెరవేర్చగలడు అందుకే కలసిమెలసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి.

ఈ తాళాలు నా ఒక్కడివి కావు మనందరివీ అని తన అన్నలిద్దర్నీ కలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు తను చెప్పినట్లే పెట్టెలో మూడు రాళ్లు పెట్టి సులువుగా సమస్యను పరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి.

సకరణ:సొంటేల ధనుంజయ

చరిత్రలో ఈరోజు, ఆగష్టు 28

సంఘటనలు

♦️ ‍1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
♦️ 2017: ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాద్యతలు స్వీకరించారు.

జననాలు

1749: గేథే, జర్మనీ రచయిత. (మ.1832)
1901 : దక్షిణభారత దేశపు నేపథ్యగాయని కానుకొల్లు చంద్రమతి జననం.
1904: దాట్ల సత్యనారాయణ రాజు, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరియు భారత పార్లమెంట్ సభ్యుడు.
1928: విలాయత్ ఖాన్, భారతీయ సితార్ వాదకుడు జన్మించాడు (మ. 2004)
1934: ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
1949: డబ్బింగ్ జానకి, ప్రముఖ దక్షిణభారత చలన చిత్ర నటి.
1959: సుమన్, తెలుగు సినిమా నటుడు.
1967: ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు
1969 : ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, మరియు రచయిత షెరిల్ శాండ్‌బర్గ్
1983 : శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో నేర్పరి లసిత్ మలింగ జననం.
1993 : బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్

మరణాలు

1958: భమిడిపాటి కామేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త. (జ.1897)
1988: చీకటి పరశురామనాయుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు. (జ.1910)
2006: డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
2015: బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత

నేటి సుభాషితం


"నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేది కలగదు."

"Stop running away from your problems because that only increases the distance from the solution. Make it right today, tomorrow is too late.

మంచి పద్యం

తనను గూర్చియే బ్రతికెడు మనుజు డిలను
సంతసమ్మును గనడిసు మంతగూడ
పొందునాతడె ఒరులకు చెందువాడు
ఋషులు చూపిన దియ్య దమృతపుబాట

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన "శ్రుతి సౌరభము" అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె

ప్రశ్న: నృత్త రత్నావళిని జాయప సేనాని ఎవరి పరిపాలనా కాలంలో రచించాడు?

జ: గణపతిదేవ

ప్రశ్న: 'మా' నది భూటాన్‌లో ఉంది. మరి 'పో' నది ఎక్కడ ఉంది?

జ: ఇటలీ

మన జాతీయములు

ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట


వివరణ: కొంత మంది తను చేయాల్సిన కనీస బాధ్యతలు చేయడం కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటారు. భార్యను పోషించడం భర్త కనీస బాధ్యత. తను, తన సంసారం కాకుండా, లోకానికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే అర్ధం ఉంది. కాని, తన వాళ్ళకి పెట్టుకుని లోకాన్ని ఉద్దరించినట్టు మాట్లాడే వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ సామెత చెప్తారు.

School Prayer 28th August, 2019 - పాఠశాల అసెంబ్లీ నేటి వార్తలు, నేటి సుభాషితం, మంచి పద్యం, మంచి మాట, ఆణిముత్యం, జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, చిన్నారి గీతం, కథ, మహానీయుని మాట, సామెత, సుభాషితం and Today GK for School Students. School Assembly Today News on 28th August, 2019 for AP and Telangana Students.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 28, 2019

0 comments:

Post a Comment