RCs

School Assembly (Prayer) on 11th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Wednesday, September 11, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

School Assembly ( Prayer ) on 11th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

School Prayer 11thSep, 2019 పాఠశాల అసెంబ్లీ - AP / Telangana Today's News, Good Poem, Today's Good News, Today's GK, Today's Good Word, Today's Good News, Today's Nationalism, National / International Days, Today's Child, Today's Story, The Great Man's Word, Today's Proverb etc for School Assembly on 11th September, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.



School Assembly (Prayer) on 11th Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు

  1. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకింగ్ నిర్ణయం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ను విధుల నుంచి తప్పిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
  2. చంద్రయాన్ 2. ల్యాండర్ ‘విక్రమ్‌’ ముక్కలు కాలేదు: ఇస్రో , "విక్రమ్ రోవర్ ల్యాండర్ నుండి ఎలాంటి సిగ్నల్స్ అందలేదు.
  3. శ్రీలంక ఆటగాళ్ల బహిష్కరణ భారత్ వల్లే: పాక్ మంత్రి. సెప్టెంబర్ నెలాఖరున ప్రారంభం కానున్న పాకిస్థాన్ పర్యటనకు వెళ్లమని పది మంది శ్రీలంక క్రికెటర్లు భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనకు వెళ్లమని సీనియర్ క్రికెటర్లు భీష్మించుకొని కూర్చున్నారు. దీనిపై పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ పై విధంగా స్పందించారు
  4. యూఎన్ వేదికగా పాక్‌ను చీల్చిచెండాడిన భారత్: అంతర్జాతీయ ఉగ్రవాదానికి మూలకేంద్రంగా ఎవరు నిలుస్తున్నారో యావత్ ప్రపంచానికి తెలుసునని, వాళ్లే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాక్ తీరును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో భారత్ ఎండగట్టింది
  5. రోజుల పిల్లల్ని అమ్మేసి మొబైల్ ఫోన్ కొనుకున్న ఓ 'మాతృమూర్తి'..బీజింగ్: బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే దారుణానికి ఒడిగట్టింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు రోజుల వయసున్న తన కవల పిల్లల్ని అమ్మేసింది. వచ్చిన డబ్బుతో బిల్లు కట్టేసి..మిగిలిన సొమ్ముతో ఓ మొబైల్ ఫోన్ కూడా కొనుక్కుంది.
  6. నాగార్జున సాగర్ 23 గేట్లు ఎత్తివేత: శ్రీశైలం నుంచి వస్తున్నవరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండడంతో నాగార్జున సాగర్ డ్యామ్ 23 గేట్లను అధికారులు తెరిచారు. 3లక్షల 77వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2లక్షల 94వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు
  7. టెస్టుల్లో ఆసీస్.. వన్డేల్లో మనం నెం.1: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్, టీం ఇండియా వెస్టిండీస్ పర్యటన అనంతరం.. ఐసీసీ తాజాగా వన్డే, టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల్లో బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్, బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్ నెం.1 స్థానంలో ఉన్నారు.

నేటి సుభాషితం

"బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు."

"The happiest people don't have the best of everything, they make the best of everything."

మంచి పద్యం

పేదలను దుఃఖముల యందు నాదుకొనిన,
రోగపీడిత మనుజుల రోతవినని,
దీన మానవ దైన్యమ్ము దీర్చలేని,
సాధకుని సాధనము కాదు సార్థకంబు

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన "శ్రుతి సౌరభము" అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె

ప్రశ్న: భార‌త‌దేశంలో మొట్టమొద‌టి నూలుమిల్లు స్థాప‌న ఏ సంవత్సరంలో జరిగింది?

జ: 1818



చరిత్రలో ఈరోజు, సెప్టెంబర్ 11

సంఘటనలు

  1. 1906 : మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు.
  2. 2001: ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు

జననాలు

  1. 1895: వినోబా భావే, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. (మ.1982)
  2. 1911: లాలా అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (మ.2000).
  3. 1915: పుపుల్ జయకర్, భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి. (మ.1997)
  4. 1955: బయ్యారపు ప్రసాదరావు, కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు.
  5. 1986: శ్రియా సరన్, ప్రముఖ సినీ నటి.

మరణాలు

  1. 1921: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (జ.1882)
  2. 1947: దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. (జ.1895)
  3. 1948: ముహమ్మద్ అలీ జిన్నా, 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు. (జ.1876)
  4. 1983: ప్రయాగ నరసింహశాస్త్రి, ప్రముఖ ఆకాశవాణి ప్రయోక్త మరియు తెలుగు నటుడు. (జ.1909)
  5. 1987: మహాదేవి వర్మ, ప్రసిద్ధ ఆధునిక హిందీ కవయిత్రి. (జ.1907)
  6. 2014: గోవిందరాజు సీతాదేవి, ప్రముఖ కథ, నవలా రచయిత్రి.

మహానీయుని మాట

"అల వచ్చినపుడు తలొంచితే ప్రాణం నిలబడుతుంది.
గొడవైనపుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది."

నేటీ మంచి మాట

"మంచివారితో మంచిగా ఉండండి. కానీ చెడ్డవారితో చెడుగా వుండకండి. ఎందుకంటే,
వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు. కానీ బురదని బురదతో కడగలేము."
School Assembly (Prayer) 11th Sep, 2019 - మంచి పద్యం, మంచి మాట, ఆణిముత్యం, జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, చిన్నారి గీతం, కథ, మహానీయుని మాట, సామెత, సుభాషితం and Today GK for School Students. School Assembly Today News on 11th September, 2019 for AP and Telangana Students.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 11, 2019

0 comments:

Post a Comment