RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

School Prayer Content on 3rd Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, September 3, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

School Prayer Content on 3rd Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

School Prayer 3rd Sep, 2019 పాఠశాల అసెంబ్లీ - AP / Telangana Today's News, Good Poem, Today's Good News, Today's GK, Today's Good Word, Today's Good News, Today's Nationalism, National / International Days, Today's Child, Today's Story, The Great Man's Word, Today's Proverb etc for School Assembly on 3rd September, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.



School Prayer Content on 3rd Sep, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ కోసం : నేటి ముఖ్యమైన వార్తలు

  1. జపాన్ ప్రధానితో రాజ్‌నాథ్ భేటీ...: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉన్నట్టు ఆయన షింజోకి తెలియజేశారు.
  2. చంద్రయాన్-2: మరో కీలక ఘట్టం పూర్తి: ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం ఆర్బిటర్ నుంచి విడివడిన విక్రమ్‌(ల్యాండర్) ప్రజ్ఞాన్(రోవర్) జాబిల్లి వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి.
  3. 9 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభ, మండలి ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
  4. భారత సంతతి మహిళను కీలక పదవికి నామినేట్ చేసిన ట్రంప్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన మరో మహిళను కీలక పదవికి నామినేట్ చేశారు. ఇండో అమెరికన్‌ న్యాయవాది షిరీన్‌ మాథ్యూస్‌ను ఫెడరల్‌ న్యాయవాదిగా నియమించారు.
  5. ధోనీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన పంత్: టీం ఇండియా, వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా 50 మందిని ఔట్ చేసిన భారత వికెట్‌ కీపర్‌గా పంత్ రికార్డు సాధించాడు.
  6. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. దీని ప్రభావంతో భారీ వర్షాలు..: వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడనుంది.

మహానీయుని మాట

" సుత్తితో ఒక దెబ్బ వేయగానే రాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి.
ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధిoచదు. ఎడతెగని ప్రయత్నం కావాలి."

నేటీ మంచి మాట

" క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ
భవిష్యత్తు మనకు అనుకూలంగా మారుతుంది."

మన సామెతలు/జాతీయములు

ఆకాశరామన్న ఆర్జీలు

వివరణ: సంతకం లేకుండా వ్రాయు ఉత్తరాలు = తమ పేరు బయట పెట్టకుండా ఒకరిని నిందిస్తూ ఉత్తరాలు రాసే వారు.

ఆకాశదీపం

వివరణ: శివాలయాల్లో ధ్వజ స్తంభంపైన గుమ్మటంలో ఉండే దీపం చుట్టూ గుమ్మటం ఎంతగా రక్షణగా ఉన్నా గాలి తాకిడికి అది వెంటనే ఆరిపోతుంది.అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపదల్ని సమకూర్చుకొని అంతలోనే ఆ సంపదలన్నీ నశించిపోయి దరిద్రులుగా మారేవారు.

ఆకు చాటు పిందెలలాగా

వివరణ: ఆకు చాటు నున్న పిందెలు, ఎండ వాన తగలకుండ సున్నితముగా ఉంటాయి। అలా ఒకరి రక్షణలో ఉన్న అమాయకపు, సున్నితపు వారిని ఆకు చాటు పిందెలలాగా అని అంటారు।

నేటి సుభాషితం

"ఏదోలా బతికెయ్యాలని కాదు, నీ ముద్ర ఏదో ఒకటి వెయ్యాలని లక్ష్యంగా పెట్టుకోవాలి"

"Our POSITIVE action combined with POSITIVE thinking results in SUCCESS"

మంచి పద్యం

పరుల నింద జేయు పరుగులిడుట కన్న
తనను తాను మిగుల తరచి చూచి
మనసులోన నున్న మలినపు మచ్చలు
మాన్పజూడ గల్గు మంగళంబు

(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన "శ్రుతి సౌరభము" అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)

నేటి జీ.కె

ప్రశ్న: రూర్కెలా ఉక్కు క‌ర్మాగారం ఏ దేశ స‌హ‌కారంతో నెల‌కొల్పబ‌డింది?

జ: బ్రిట‌న్



చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 3

సంఘటనలు

1831 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
2009: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.

జననాలు

1893: కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988)
1905: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (మ.1986)
1905: కార్ల్ డేవిడ్ అండర్సన్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991)
1908: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953)
1924: కావూరి పూర్ణచంద్రరావు - అష్టావధాని, గ్రంథరచయిత.
1935: శరద్ అనంతరావు జోషి, ప్రముఖ రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (మ.2015)
1965: కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్, అమెరికన్ నటుడు.
1971: కిరణ్ దేశాయ్, భారతదేశ ప్రముఖ రచయిత్రి.
1974: మల్లి మస్తాన్‌ బాబు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. (మ.2015)

మరణాలు

1962: వినాయకరావు కొరాట్కర్, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895)
1969: హొ చి మిన్ వియత్నాం సామ్యవాద నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890)
1987: రమేష్ నాయుడు, సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
2011: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
2011: ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. (జ.1921)

జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం
School Prayer 3rd Sep, 2019 - పాఠశాల అసెంబ్లీ నేటి వార్తలు, నేటి సుభాషితం, మంచి పద్యం, మంచి మాట, ఆణిముత్యం, జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, చిన్నారి గీతం, కథ, మహానీయుని మాట, సామెత, సుభాషితం and Today GK for School Students. School Assembly Today News on 3rd September, 2019 for AP and Telangana Students.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 03, 2019

0 comments:

Post a Comment