Corona How to Know open shop in your Area - Say Google Anna, let's say Google
Corona How to Know open shop in your Area - Say Google Anna, let's say Google : How to find your area essentials shop open close in Google. The shop has opened, let's go through Google. కరోనా: గూగుల్‌లో చెప్పేయ్ అన్నా...దుకాణం తెరిచింది, లేనిదీ గూగుల్ ద్వారా తెలిపే వీలు : కోవిడ్-19 లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువులు లభించే దుకాణాలు తెరిచి ఉన్నాయో లేదో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాంతంలో ఏయే షాపులు తెరిచి ఉన్నాయో తెలియక అంతా తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దుకాణ యజమానులు తాజా సమాచారాన్ని వినియోగదారులకు ఎప్పటికప్పుడు తెలియచేసే వీలును గూగుల్ కలిగిస్తోంది. ఈ కొత్త సదుపాయాన్ని దుకాణదారులు ‘గూగుల్ సెర్చ్’ ద్వారా మాత్రమే కాకుండా ‘గూగుల్ మ్యాప్’ల ద్వారా కూడా తెలియజేయవచ్చని ఈ మేరకు చేసిన ఓ ప్రకటనలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలియచేశారు.Corona How to Know open shop in your Area - Say Google Anna, let's say Google
ఎలా చెప్పాలంటే...(How to Say) :- దుకాణ యజమానులు గూగుల్‌లో ‘గూగుల్ మై బిజినెస్’ ఖాతా తెరవాలి. (ఇప్పటికే లేనివారు)
- అనంతరం దాని మెనూలో ఉండే ‘CLOSE THE BUSINESS ON GOOGLE’ (క్లోజ్ ద బిజినెస్ ఆన్ గూగుల్) అనే సెక్షన్‌కు వెళ్లాలి.
- అక్కడ ఉండే మూడు ఆప్షన్లలో “MARK AS TEMPORARILY CLOSED” (మార్క్ యాజ్ టెంపరరీలీ క్లోజ్డ్) అనే దానిని ఎంచుకోవటం ద్వారా... తమ దుకాణం తాత్కాలికంగా మూసివేయబడింది అనే సమాచారాన్ని తమ ప్రొఫైల్‌లో అని అప్‌డేట్ చేయవచ్చు.
- ఇక తమ వ్యాపార వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లయితే, ‘SPECIAL HOURS’ (స్పెషల్ అవర్స్) అనే ఫీచర్ ద్వారా ఆ విషయాన్ని కూడా తమ ఖాతాదారులకు తెలియచేయవచ్చు.
ఇదివరకు ప్రభుత్వ సమాచారం ఆధారంగా మాత్రమే దుకాణాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేది. కాగా, తమ దుకాణాలు మూసి ఉన్నట్లయితే ఆ విషయాన్ని వ్యాపారులు ప్రజలకు నేరుగా తెలిపే విధంగా అప్‌డేట్ చేయగల సదుపాయాన్ని గూగుల్ ఇప్పుడు కల్పించింది. ఐతే సరైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత దుకాణదారులపైనే ఉందని... ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూగుల్ విజ్ఞప్తి చేసింది.
Benefits of Pradhan Mantri Garib Kalyan Yojana in Telugu
0 comments:
Post a Comment