Bumper offer for who want to buy Gold - Central Government | తక్కువ ధరకు బంగారం
The Central Government has announced a bumper offer for those who want to buy Gold. Release of the schedule is related to the issuance of Gold Bonds for the first six months of the current financial year 2020-21. కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల గోల్డ్ బాండ్ల జారీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆరు విడతల్లో గోల్డ్ బాండ్ల జారీ ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు లేదా ఎంపిక చేసిన పోస్టాఫీస్‌లకు వెళ్లి గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.Bumper offer for who want to buy Gold - Central Government | తక్కువ ధరకు బంగారం
Schedule of Gold Bonds issued details ..
1 . ఏప్రిల్ 20-24 వరకు తొలి విడత బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఏప్రిల్ 28న బాండ్లు జారీ చేస్తారు.2 . మే 11-15 వరకు రెండో విడత బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.మే 19న బాండ్లు జారీ చేస్తారు.
3 . జూన్ 08-12 వరకు మూడో విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. జూన్ 16న బాండ్లను జారీ చేస్తారు.
4 . జూలై 6 -10 వరకు నాలుగో విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. జూలై 14న బాండ్లను జారీ చేస్తారు.
5 . ఆగస్ట్ 03-07 వరకు ఐదో విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఆగస్ట్ 11న బాండ్లను జారీ చేస్తారు.
6 . ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 04 వరకు ఆరో విడత గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. సెప్టెంబర్ 8న బాండ్ల జారీ ఉంటుంది.
More details ...
0 comments:
Post a Comment