RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

AP Cabinet Meeting Details , Decessions on 18th July 2019

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, July 18, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

AP Cabinet Meeting Details , Decessions on 18th July 2019

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, చట్టసవరణ ముసాయిదాలకు ఆమోదం తెలిపింది.వాటిలో భాగంగా.. జూడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుపై చట్టసవరణకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ వర్క్‌లు కేటాయించేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. కౌలు రైతుల రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపడంతోపాటు.. యాజమాని హక్కులకు భంగం కలగకుండా 11 నెలల పాటు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేలా బిల్లుకు ఆమోదం తెలిపింది.



AP Cabinet Meeting Details , Decessions on 18th July 2019 


రాష్ట్రంలో 1,33,867 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ అంగీకారం తెలిపింది. భూముల రికార్డులపై కేబినెట్‌ చట్టసవరణ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,114 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటుకు కేబినెట్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అలాగే అక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 417 కోట్ల భారం పడనుంది. ఎస్సీ, ఎస్టీ గృహావసరాలకు 200 యూనిట్ల విద్యుత్‌ను అందించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. అంగన్‌వాడీల జీతాల పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింద
అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.


కేబినెట్ నిర్ణయాలు:

* గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల భర్తీకి కెబినెట్ గ్రీన్ సిగ్నల్.
* 1,33,867 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అంశానికి ఆమోదం.
* మండల పరిషత్, జిల్లా పరిషత్తులకు స్పెషలాఫీసర్ల నియామకానికి ఆమోదం.
* ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి గ్రీన్ సిగ్నల్.
* ఆక్వాకు రూ. 1.50కే విద్యుత్ సరఫరాకు ఆమోదం.
* అంగన్వాడీల జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్.
* కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదంయ భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు గ్రీన్ సిగ్నల్.
* భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం.
* భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పులకు ఉద్దేశించిన ముసాయిదాకు ఆమోదం.
* మద్య నిషేధం దిశగా తొలిఅడుగు, తొలిదశ చర్యలు ప్రారంభం.
* ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ, మసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్.
* గడువు తీరిన స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి ఆమోదముద్ర.
* ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కుకోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం.
* అంగన్ వాడీ వర్కర్లకు రూ.11,500, మిని అంగన్ వాడీ వర్కర్లకు రూ.7వేలు, అంగన్ వాడీ హెల్సర్ కు రూ.7వేలు జీతాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.. జులై నుంచి పెంపుదల వర్తింపు.
* పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న గ్రామ సచివాలయాలు.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు కేబినెట్ ఆమోదం.
* ప్రభుత్వ వ్యవస్థలను ప్రతి గ్రామం ముంగిటకు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమన్న కేబినెట్.
* ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకానికి మంత్రివర్గం ఆమోదం.
* వీరికి నెలకు రూ.5వేలు ఇచ్చేందుకు అంగీకారం.
* పంచాయతీరాజ్ శాఖకు గ్రీన్ సిగ్నల్.
* పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా వ్యవస్థకు కేబినెట్ ఆమోదం.
* దేవాదాయ శాఖ చట్టంలో మార్పులకు ఉద్దేశిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్
AP Cabinet Meeting Details , Decessions on 18th July 2019 , ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 18, 2019

0 comments:

Post a Comment