RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

ISRO Chandrayaan 2 live link 2019 | Project Specifications చంద్రయాన్-2 ప్రయోగం 2:43 PM on 22nd July 2019

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, July 22, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

ISRO Chandrayaan 2 live link 2019 | Project Specifications చంద్రయాన్-2 ప్రయోగం  2:43 PM on 22nd July 2019 

Students కు చెప్పవలసిన విషయాలు చంద్రయాన్-2 ప్రయోగం... ఎన్నో ప్రత్యేకతలు... అవేంటో తెలుసుకుందామా. ISRO Chandrayaan 2 : ఇప్పటివరకు చందమామపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపించాయి. ఆ తర్వాత భారత్ కూడా తన తొలి రోవర్‌ను చంద్రుడిపైకి పంపుతోంది. ఐతే... చందమామ దక్షిణ ధ్రువానికి రోవర్‌ను పంపుతున్న తొలి దేశం మాత్రం భారతే.



ISRO Chandrayaan 2 live link 2019 | Project Specifications చంద్రయాన్-2 ప్రయోగం  2:43 PM n 22nd July 2019 

Chandrayaan-2 :చంద్రయాన్-2 ప్రయోగం... ఎన్నో ప్రత్యేకతలు... అవేంటో తెలుసుకుందామా...
130 కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా చూస్తున్న ఘట్టం నేడు మద్యాహ్నం 2.43 నిమిషాలకు చంద్రుడి చుట్టూ తిరుగుతూ రహస్యాల్ని కనిపెట్టే... చంద్రయాన్-2 ఉపగ్రహం, చందమామపై దిగే విక్రమ్ ల్యాండర్, ల్యాండర్ లోంచీ బయటకు వచ్చి... చందమామపై తిరిగే ప్రజ్ఞాన్ రోవర్... లను మోసుకుంటూ... GSLV మార్క్-3 రాకెట్... నిప్పులు చిమ్ముతూ... చందమామ వైపు దూసుకెళ్లబోతోంది. ఇందుకోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోట ప్రయోగ కేంద్రంలో పూర్తి ఏర్పాట్లు జరిగాయి. రెండో ప్రయోగ వేదిక దగ్గర దూసుకెళ్లేందుకు రాకెట్ రెడీగా ఉంది. రెండుసార్లు రిహార్సల్స్ చేసి... అంతా పర్ఫెక్టుగా ఉండటంతో... ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాన పడినా ఇబ్బంది లేకుండా... మార్క్ 3 రాకెట్‌ను రెయిన్ ప్రొటెక్షన్‌తో తయారుచేయడం విశేషం.

ISRO Chandrayaan 2 live link 2019 | Project Specifications చంద్రయాన్-2 ప్రయోగం

ఇవీ ప్రాజెక్టు ప్రత్యేకతలు :

- ఈ రాకెట్ ప్రయోగంలో మూడు దశలు ఉన్నాయి. రాకెట్ ప్రయోగించిన 16 నిమిషాల 13 సెకండ్లకు... భూమి నుంచీ 181.6 కిలోమీటర్ల ఎత్తులో... చంద్రయాన్-2 ఉపగ్రహం, విక్రమ్ ల్యాండర్‌ ఉన్న పేలోడ్ రాకెట్ నుంచీ బయటకు వస్తుంది. అక్కడితో రాకెట్ పని పూర్తయినట్లు లెక్క.
- ఈ పేలోడ్ భూ నియంత్రిత కక్ష్యా మార్గంలోకి చేరుతుంది. ఆ తర్వాత అది 17 రోజుల పాటూ రోదసిలో తిరుగుతూ... చందమామ దగ్గర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మరో 6 రోజులు అలాగే తిప్పుతారు. ఆ తర్వాత చంద్రయాన్-2ని పేలోడ్ నుంచీ బయటకు తెస్తారు. అది 28 రోజులపాటూ చందమామ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా అది చందమామ కక్ష్యా మార్గంలోకి చేరుతుంది.
- చంద్రయాన్-2 ప్రయోగం జరిగిన 50 రోజుల తర్వాత పేలోడ్ నుంచీ విక్రమ్ ల్యాండర్ బయటకు వస్తుంది. ఇది 54వ రోజున అంటే సెప్టెంబర్ 6 లేదా 7న చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుంది.
- ల్యాండర్ సేఫ్‌గా దిగిన తర్వాత... అందులోంచీ... ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. అది చందమామపై 500 మీటర్ల ఏరియాలో తిరుగుతుంది.
- ప్రజ్ఞాన్ రోవర్... చందమామపై మట్టి, రసాయనాలు, నీటి జాడలు, మూలకాలు, ఖనిజాలు వంటి విషయాల్ని ఇస్రోకి చేరవేస్తుంది.
- ప్రధానంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీరు గడ్డకట్టి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ల్యాండర్‌ను అక్కడ ల్యాండ్ చేస్తున్నారు.
- చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ... చందమామను హెచ్‌డీ ఫొటోలు తీస్తూ... ఇస్రోకు పంపుతుంది.
- చంద్రయాన్-2 ప్రయోగాన్ని మనం లైవ్‌లో చూడొచ్చు. అలాగే ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు.
- ప్రజ్ఞాన్ అంటే తెలివి అని అర్థం. చంద్రయాన్-2లో చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ కంటే... చందమామపై తిరిగే రోవర్‌ దే కీలక పాత్ర అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకూ ఇలా చందమామపై రోవర్లను దించిన దేశాలు అమెరికా, రష్యా, చైనా మాత్రమే.
- 27 కేజీల ప్రజ్ఞాన్ రోవర్... నీటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తుందా అని శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు. చందమామపై కావాల్సినంత నీరు ఉంటే... ఇక మనుషులు అక్కడకు వెళ్లి, కాలనీలు ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుంది.
- ఐదేళ్లుగా చేస్తున్న ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు. ఆ మధ్య వచ్చిన హాలీవుడ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు అయిన ఖర్చు 356 మిలియన్ డాలర్లు. చంద్రయాన్-2 ప్రాజెక్టుకు అయిన ఖర్చు డాలర్లలో చెప్పాలంటే... అంతా కలిపి 142 మిలియన్ డాలర్లే. ఇంత తక్కువ ఖర్చుతో అంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తున్న ఇస్రోపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
- ఇస్రో ప్రయోగాన్ని మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రత్యక్షంగా చూడబోతున్నారు. అక్కడి గ్యాలరీ నుంచీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయోగాన్ని చూస్తారు.
- ఇప్పటివరకూ చంద్రుడి దక్షిణ ధ్రువాన్నీ ఏ దేశమూ టచ్ చెయ్యలేదు. అంతరిక్ష ప్రయోగాల్లో తామే కింగ్ అని చెప్పుకునే నాసా సైతం... అక్కడ అడుగు పెట్టలేదు. ఇప్పుడు మాత్రం ఇస్రో ప్రయోగం జరుగుతుంటే... తాము కూడా 2024లో చందమామపై వ్యోమగాముల్ని పంపుతున్నామని చెబుతోంది. ఇన్నాళ్లూ లేని ఆసక్తి నాసాకు ఇప్పుడెందుకు వచ్చిందంటే... కారణం ఇస్రో చందమామపై చేస్తున్న ప్రయోగాలే.
- ఏది ఏమైనా చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం ఇది. ఎప్పుడో 50 ఏళ్ల కిందట... ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్... భారత అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఎడ్లబండ్లు, సైకిళ్లపై రాకెట్లను తీసుకెళ్లేవాళ్లు. అలా మొదలైన ఇస్రో ప్రస్థానం... ఇప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయికి చేరడం ప్రతీ భారతీయుడూ గర్వించదగ్గ పరిణామం.

చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని విద్యార్థులకు చూపాలి - విద్యాశాఖ మంత్రి ఆదేశం

చంద్రయాన్‌-2 ప్రయో గాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ర్థులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిజిటల్‌, వర్చువల్‌ తరగతులు, టివి, ఇతర సామాజిక మాద్యమాల ద్వారా విద్యార్థులకు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చూపించేలా రాష్ట్రంలోని ప్రధానోపాధ్యా యులందరికీ ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 2.00 గంటల నుండి చంద్రయాన్‌-2 విశేషాలను దాని, ప్రాముఖ్యతను http://www.isro.gov.in/chandrayaan2home లింక్‌ద్వారా విద్యార్థులకు చూపించాలని కోరారు.



చంద్రయాన్II కళ్లకు కట్టినట్టు చూపిన ఇస్రో వీడియో


ఈనెల 15న చంద్రయాన్ -2 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఓ యానిమేషన్ వీడియోని విడుదల చేసింది. చంద్రయాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రయోగం ఎలా మొదలవుతుంది, రాకెట్ నుంచి వేరుపడిన తర్వాత ఉపగ్రహం జాబిల్లి చుట్టూ ఎలా తిరుగుతుంది, ఎలా చంద్రునిపై ల్యాండ్ అవుతుంది అనే విశేషాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ ఎంకే-III వాహకనౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ను ప్రవేశ పెట్టనున్నారు. ల్యాండర్కు ‘విక్రమ్’ అని, రోవర్కు ‘ప్రగ్యాన్’ అని పేర్లు పెట్టారు.

 శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్ర నుంచి జులై 15 వేకువజామున 2.51 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించారు. 2019 సెప్టెంబర్ 6న చంద్రయాన్-2 రోవర్ చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 13 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భారత్కు చెందిన 6, యూరోప్కు చెందిన 3, అమెరికాకు చెందిన 2 పేలోడ్స్ ఉన్నాయి. చంద్రయాన్-2 మొత్తం బరువు 3.8 టన్నులు. ఇస్రో 2009లో చంద్రయాన్-1ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

ISRO Chandrayaan 2 live link 2019 | Project Specifications చంద్రయాన్-2 ప్రయోగం 2:43 PM on 22nd July 2019 at https://www.isro.gov.in/gslv-mk-iii-m1-chandrayaan-2-mission/watch-live-launch-of-gslv-mkiii-m1-chandrayaan2-july-22-2019.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 22, 2019

0 comments:

Post a Comment