RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

School Assembly on 26th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, August 26, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

School Assembly on 26th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ - 26th August, 2019 : AP / Telangana Today's News, Good Poem, Today's Good News, Today's GK, Today's Good Word, Today's Good News, Today's Nationalism, National / International Days, Today's Child, Today's Story, The Great Man's Word, Today's Proverb etc for School Assembly on 26th August, 2019. నేటి వార్తలు, మంచి పద్యం, నేటి సుభాషితం, Today GK, నేటీ మంచి మాట, నేటి ఆణిముత్యం, నేటి జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, నేటి చిన్నారి గీతం, నేటి కథ, మహానీయుని మాట, నేటి సామెత, నేటి సుభాషితం for AP and Telangana School Students and School Assembly.



School Assembly on 26th August, 2019 Today News | పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు - మంచి పద్యం - సూక్తి-ఆణిముత్యం

పాఠశాల అసెంబ్లీ : నేటి వార్తలు 26th August, 2019 (Today News)

1. చరిత్ర సృష్టించిన పీవీ సింధు - మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ 
2. గృహ వాహన రుణాల EMI లు తగ్గుతాయి అని నిర్మలాసీతారామన్ గారు తెలిపారు.
3. ఆధార్, ఈ–కేవైసీ నమోదుకు గడువు అనేది లేదని, ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
4. బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీకి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.

చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 26

1451 : అమెరికా ఖండాన్ని కనుగొన్న క్రిష్టొఫర్ కొలంబస్ జననం (మ.1506).
1873 : తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న లీ డి ఫారెస్ట్ జననం.(మ.1961)
1906 : పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ జననం.(మ.1993)
1910 : రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది మరియు కరుణామయి మదర్ తెరిస్సా జననం.(మ.1997).
1920 : ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం.(మ.1955)
1956 : నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి మేనకా గాంధీ జననం.
1963 : భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు వాడపల్లి వెంకటేశ్వరరావు జననం.(మ.2008)
1964 : తెలుగు వ్యక్తి, 275 సినిమాలలో నేటించిన ప్రముఖ నటుడు సురేశ్ జన్మదినం.
1965 : సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి వేణుగోపాల్ జననం.
1982 : భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము హైదరాబాదు లో ప్రారంభించబడినది.

మంచి మాట:

వివేకానికి మారుపేరుగా నిలిచిపోయే హంసపక్షి స్మశానంలో వుండదు. అలాగే, మంచివారు చెడ్డవారితో కలసి మెలసి వుండలేరు. --అబ్రహం లింకన్.

పద్యము:

  ”పున్యావనే ,ద్రోహమతీ న్విదేశ్యం ——సద్గర్భ నిష్టాన్ ,ఖలుసే హిషే ,త్వం —వుచ్చైస్శిరత్వం ,తవ శూచితం ,హి —హిమాద్రి శ్రుమ్గేన మహోన్నతేన ”

భావము:

అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేస్తుందట భారత దేశం .                         
ఆమె ఉదాత్త బుద్ధి ,ఎత్తైన హిమాలయ శిఖరమనే శిరస్సు వల్లనే తెలిసి పోతుందట.

(భారతదేశం యొక్క గొప్పతనం ఎంత అందంగా చెప్పారో చూడండి.)

నేటి ఆణిముత్యం 

కానివానితోడ గలసి మెలగుచున్న
గానివానిగానె కాంతురవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం-:

చెడు నడవడిక కలిగిన వారితో కలిసి తిరిగినట్లయితే వీరు కూడా చెడ్డవారి జాబితాలో చేరిపోతారు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా సరే, అతను కల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కానీ పాలు తాగుతున్నాడని అతన్ని ఎవరూ అనుకోరు.

పోలికలు చెప్పటంలో దిట్టైన వేమన, తాటి చెట్టు కింద పాలు తాగేవారితో పోలుస్తూ, చెడ్డవారితో స్నేహం చెడ్డది సుమా అని హెచ్చరిస్తున్నారు. పాలు, కల్లు కూడా తెల్లగానే ఉంటాయి. పాలు తాగేవారెవరూ తాటి చెట్టు దగ్గరికి పోయి తాగరు. కానీ ఒకవేళ అలా తాగుతుంటే అతన్ని చూసేవారు అతను తాగేది పాలు అని అనుకోరు కదా, అలాగే చెడు ప్రవర్తనతో దుందుడుకు చర్యలతో తిరుగుతుండేవారితో స్నేహం చేసి వారితో కలిసి ఆవారాగా తిరిగితే, ఆ మనిషి ఎంత మంచివాడైనా సరే, అతన్ని కూడా చెడ్డవాడిగానే పరిగణిస్తారు. మానవులంతా ఒకటే, అందరూ సమానులే సర్వమానవ ప్రేమ కలిగివుండాలి, ఇదంతా నిజమ, ఎవరినీ తక్కువగా చూడనక్కరలేదు కానీ, అలాగని అందరితో పూసుకుని తిరగటం కూడా ముప్పు తీసుకురావొచ్చు. అందువలన మనం ఎలాంటివారితో చెలిమి చేస్తున్నామన్నది ఆలోచించవలసిన విషయం. ఏజాతి పక్షులు ఆ జాతి పక్షులతోనే కలిసి ఎగురుతాయని, ఒకేరకం మనస్తత్వాలు కలగినవారే కలిసి మనగలరని మనుషుల నమ్మకం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే సమాజంలో మెసులుకోవాలని వేమనాచార్యుల హెచ్చరిక.

నేటి సుభాషితం

నీళ్ళ ఫై నిలబడి, నీళ్ళును చూస్తూ సముద్రమును దాటలేవు

నేటి జాతీయాలు 

కాళ్ల బేరానికొచ్చాడు
క్షమించమని కోరు తున్నాడు
కాలం వెళ్ల దీస్తున్నాడు
భారంగా బ్రతుకీడుస్తున్నాడని అర్థం

నేటి సామెత 

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి

దీపం కాంతులను వెదజల్లుతున్నప్పుడు ఆ వెలుగులో మన పనులను చక్కపెట్టుకుంటాం, కాంతి తోలగిపోతె ఎ పని చేయలేము. అంటే ఏ సమయానికి ఏం చేయాలో ఆలోచించుకొని ఆలస్యం చేయకుండ మనిషి జీవితాన్ని సాగించాలని ఈ సామెత పరమార్దం.

నేటి కథ 

తెనాలి రామకృష్ణుడి తెలివి తేటలు జగత్ప్రసిద్ద మైనాయి.

ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని మాకు కొంచెం పంపించ గలరు అని వ్రాసి తన దూత తో పంపించాడు రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు రామకృష్ణుడు తల వూపి యింటికి వెళ్ళిపోయాడు యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది.

దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం కనిపించింది అంటే అతనికి ఒక ఉపాయం తట్టింది బజారుకు వెళ్లి చిన్న మూతి గల కుండ నొకదానిని కొనుక్కొచ్చాడు మెల్లగా అ పిందెను ఆ కుండ లో దించాడు మరుదినం సభకు వెళ్లి ఒక నెల తర్వాత నేనే పంపుతానని చెప్పి ఆ దూతను పంపించి వేశాడు నెల తర్వాత ఆ పిందె పెరిగి ఆ కుండ నిండా
అయింది.రామకృష్ణుడు తొడిమ కత్తిరించి ఆ కుండను ఒక దూతకు యిచ్చినవాబుకు పంపుతూ ఈ కుండను పగుల గోట్టకుండా తెలివిని తీసుకోవలిసిందని వ్రాసి పంపించాడు.

ఆ నవాబుకు కుండను పగుల గోట్టకుండా దాన్ని ఎలా బయటకు తియ్యాలో తెలియక మాకు దాన్ని బయటకు తియ్యడ మేలాగో తెలీలేదు మీ రామకృష్ణుడిని పంపి తీసి యిమ్మని వ్రాసి పంపించాడు రామకృష్ణుడు ఆ నవాబు సభకు వెళ్లి ఆ కుండను తెప్పించి ఒక పదునైన కత్తిని కూడా తెమ్మన్నాడు ఆ కట్టి తీసుకొని మెల్లగా కుండలో పెట్టి
నిదానంగా ఆ గుమ్మడి కాయను ముక్కలుగా కోశాడు చెయ్యి పెట్టి మెల్లగా ఒక్కో ముక్కనే బయటికి తీశాడు సభలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తూ వుండి పోయారు.

నవాబు రామకృష్ణుడిని మెచ్చుకొని చాలా బహుమానాలిచ్చి గౌరవంగా సాగనంపాడు.



నేటి చిన్నారి గీతం 

యువతరం కదిలింది కదిలింది
యువతరం కదిలింది కదిలింది కదిలింది
నవతరం లేచింది లేచింది లేచింది
యువతరం శిరమెత్తితే నవతరం గళమిప్పితే
లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా
లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా
దురాచార బంధనాలు దొర్లిపడిన పల్లెల్లో
దోపిడి దొంగల దొడ్లై దోచే యీ పట్నాల్లో
కొత్తవెలుగు రాదా సరికొత్త బ్రతుకు రాదా
కొత్తవెలుగు రాదా సరికొత్త బ్రతుకు రాదా
||యువతరం||
కలవారి పిడికిలిలో నలుగుతున్న సిరిసంపద
కామాంధుల చేతచిక్కి కన్నీరిడు నేలతల్లి
నలుగురిదీ కాదా అది నవయుగమై రాదా
నలుగురిదీ కాదా అది నవయుగమై రాదా
||యువతరం||
విడని గొలుసు లంకెల ముడి మడత పేచీ రాజ్యాంగం
కల్లోలిత పాలనలో నలిగిపోవు ఈ దేశం
మారిపోవు తధ్యం నవమానవుడే నిత్యం
మారిపోవు తధ్యం నవమానవుడే నిత్యం
||యువతరం||

సకరణ:సొంటేల ధనుంజయ

School Assembly Today News on 26th August, 2019 for AP and Telangana Students. పాఠశాల అసెంబ్లీ - నేటి వార్తలు, నేటి సుభాషితం, మంచి పద్యం, మంచి మాట, ఆణిముత్యం, జాతీయం, జతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు, చిన్నారి గీతం, కథ, మహానీయుని మాట, సామెత, సుభాషితం and Today GK for School Students.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 26, 2019

0 comments:

Post a Comment