4 Days Bank Holidays from 25th, 27th, 28th, 29th March, 2020 | Alert for Bank Customers
4 Days Bank Holidays from 25th, 27th, 28th, 29th March, 2020 | Alert for Bank Customers : వచ్చే వారంలో బ్యాంకులు 4 రోజులు బంద్.. ఎప్పుడెప్పుడంటే?. Bank Holidays | బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. బ్యాంకులు వచ్చే వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. దీంతో బ్యాంక్‌లో మీకు ఏమైనా పని ఉంటే.. ముందుగానే జాగ్రత్త పడండి.4 Days Bank Holidays from 25th, 27th, 28th, 29th March, 2020 | Alert for Bank Customers
ప్రధానాంశాలు:
- వారంలో 3 రోజులే పనిచేయనున్న బ్యాంకులు
- బ్యాంక్ హాలిడేస్‌తోపాటు బ్యాంక్ యూనియన్ల సమ్మె హెచ్చరిక ఇందుకు కారణం
- దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం.
అందువల్ల మీకు వచ్చేవారంలో బ్యాంక్‌లో ఏమైనా పనులు ఉంటే జాగ్రత్త పడండి.
బ్యాంక్ యూనియన్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ (10 బ్యాంకులను 4 బ్యాంకులుగా మార్చడం) సమ్మె చేయనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓవే) ఇప్పటికే సమ్మె హెచ్చరికలు జారీ చేశాయి. మార్చి 27న అఖిల భారత బ్యాంక్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చాయి. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ సమ్మెలో పాల్గొననుంది.
- బ్యాంకులు వచ్చే వారంలో సోమవారం, మంగళవారం పని చేస్తాయి.
- బుధవారం ఉగాది పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది.
- బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి పలు ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. బుధవారం మార్చి 25 అవుతుంది.
ఇక బ్యాంకులు గురువారం మళ్లీ పనిచేస్తాయి. - తర్వాతి రోజు అంటే శుక్రవారం బ్యాంక్ సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
- ఇకపోతే శనివారం బ్యాంకులు ఎలాగూ పనిచేయవు.
- తర్వత ఆదివారం. ఈరోజు కూడా బ్యాంకులు బంద్.
- అంటే వారంలో బ్యాంకులు 3 రోజులే పనిచేస్తాయి.
0 comments:
Post a Comment